Begin typing your search above and press return to search.

మెగా కోడలు 'సతీ లీలావతి'.. ఎంతవరకు వచ్చిందంటే..

టాలీవుడ్ ప్రముఖ మెగా ఫ్యామిలీలోకి రీసెంట్ గా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అటు ఫ్యామిలీ లైఫ్.. ఇటు కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుని దూసుకుపోతోంది.

By:  Tupaki Desk   |   22 Feb 2025 10:52 AM GMT
మెగా కోడలు సతీ లీలావతి.. ఎంతవరకు వచ్చిందంటే..
X

టాలీవుడ్ ప్రముఖ మెగా ఫ్యామిలీలోకి రీసెంట్ గా హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు అటు ఫ్యామిలీ లైఫ్.. ఇటు కెరీర్ ను చక్కగా ప్లాన్ చేసుకుని దూసుకుపోతోంది. అందాల రాక్షసి సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆమె.. డెబ్యూ మూవీతోనే అందరినీ ఆకట్టుకుంది. తన యాక్టింగ్ తో మెప్పించేసింది.


ఆ తర్వాత టాలీవుడ్ యంగ్ హీరోలందరితో జత కట్టిన ముద్దుగుమ్మ.. మెగా హీరో వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కాస్త సినిమాలకు దూరంగా ఉన్న అమ్మడు.. ఆ మధ్య మిస్ పర్‌ ఫెక్ట్ వెబ్ సిరీస్ తో సందడి చేసింది. ఇప్పుడు సతీ లీలావతి సినిమాతో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది అమ్మడు.

దేవ్ మోహన్‌‌ మేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న సతీ లీలావతి మూవీని భీమిలి కబడ్డీ జట్టు ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జెట్ స్పీడ్ లో చిత్రీకరణను పూర్తి చేస్తున్నారు మేకర్స్.

ఇప్పుడు ఫస్ట్ షెడ్యూల్ పూర్తి అయింది. ఈ మేరకు లావణ్య త్రిపాఠి.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. పిక్ ను కూడా షేర్ చేయగా.. అందులో మూవీ టీమ్ అంతా ఉంది. అయితే ఫస్ట్ షెడ్యూల్ లో హీరో హీరోయిన్ల మీద కీలక సన్నివేశాలు మేకర్స్ షూట్ చేశారని తెలుస్తోంది. ఆడియన్స్ ను ఆ సీన్స్ ఆకట్టుకుంటున్నాయని సమాచారం.

ఇక సినిమా విషయానికొస్తే.. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్‌, ట్రియో స్టూడియోస్ బ్యానర్ల పై ప్రొడ‌క్షన్ నెం.1గా నాగమోహ‌న్ బాబు.ఎమ్‌, రాజేష్‌.టి గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. రీసెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో పూర్తవ్వగా.. త్వరలోనే సెకెండ్ షెడ్యూల్ ను స్టార్ట్ చేయనున్నారు.

అయితే సతీ లీలావతి మూవీ.. ఫీల్ గుడ్ జోనర్ లో రూపొంది అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఉంటుందని ఇప్పటికే మేకర్స్ తెలిపారు. కంప్లీట్ ఎంటర్టైనర్‌ ‌‌‌గా, ప్రేక్షకులంతా హాయిగా నవ్వుకునేలా తీస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా లావణ్య రోల్ ఆకట్టుకునేలా ఉంటుందని అన్నారు. సమ్మర్ కానుకగా మూవీ రిలీజ్ చేయనున్నామని వెల్లడించారు. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో వేచి చూడాలి.