Begin typing your search above and press return to search.

ఆమెతో ఫిజికల్ రిలేషన్ షిప్- రాజ్ తరుణ్ ఏమన్నారంటే..

రాజ్ తరుణ్ ఇష్యూ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   6 July 2024 6:05 AM GMT
ఆమెతో ఫిజికల్ రిలేషన్ షిప్- రాజ్ తరుణ్ ఏమన్నారంటే..
X

రాజ్ తరుణ్ ఇష్యూ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తనతో లివింగ్ రిలేషన్ లో ఉంటూ పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసాడని లావణ్య అనే యువతి పోలీసులకి ఫిర్యాదు చేసింది. 11 ఏళ్ళుగా మేమిద్దరం రిలేషన్ షిప్ లో ఉన్నామని లావణ్య పేర్కొంది. అలాగే శారీరకంగా వాడుకొని ఇప్పుడు ముఖం చాటేసాడని, వేరొక హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకొని తనని దూరం పెట్టాడని లావణ్య ఫిర్యాదు చేసింది.

అయితే దీనిపై రాజ్ తరుణ్ మీడియా ముందుకొచ్చి తన వెర్షన్ తెలియజేశాడు. ఏ రోజు నేను పెళ్లి చేసుకుంటానని లావణ్యకి ప్రామిస్ చేయలేదని రాజ్ తరుణ్ పేర్కొన్నారు. నాకు పెళ్లి చేసుకునే ఆలోచన కూడా లేదని తెలిపాడు. కేవలం నా దగ్గర ఉన్న డబ్బు కోసం ఆమె నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుందని రాజ్ తరుణ్ ఆరోపించారు. ఆమెతో కొంతకాలం రిలేషన్ లో ఉన్నమాట వాస్తవమే అని తెలిపాడు.

అది 2-3 ఏళ్ళు మాత్రమే సాగిందని, తరువాత ఆమెని భరిస్తూ వచ్చాను తప్ప మనస్పూర్తితో ఆమెతో కలిసిలేనని తెలిపాడు. అలాగే తనతో ఏ విధమైన శారీరక సంబంధం కూడా పెట్టుకోలేదని రాజ్ తరుణ్ వివరణ ఇచ్చాడు. ఆమె తనపై కావాలని అసత్య ఆరోపణలు చేస్తుందని తెలిపాడు. డ్రగ్స్ కేసులో ఆమె దొరికిపోయిన తర్వాత నా ఇంట్లో ఉంటున్న ఆమె నుంచి నేనే దూరంగా రావడం జరిగిందని అన్నాడు.

కేవలం రోడ్డు మీదకొచ్చి నా ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవడం ఇష్టం లేక ఇన్ని రోజులు తనని నా ఇంట్లో ఉండనిచ్చానని తెలిపాడు. అయితే ఇప్పుడు లీగల్ గా వెళ్లాలని డిసైడ్ అయ్యానని, డబ్బులు డిమాండ్ చేసిన ఇవ్వడం లేదని రాజ్ తరుణ్ చెప్పాడు. లావణ్య కి డ్రగ్స్ అలవాటు ఉందని, వాటిని మానుకోమని చెప్పినందుకు నాతో గొడవలు పెట్టుకోవడం స్టార్ట్ చేసిందని అన్నారు. ఇప్పుడు తాను ఉంటున్న నా ఇంటిని సొంతం చేసుకోవాలనే కుట్రపూరితంగా ఇలా పోలీసులకి ఫిర్యాదు చేసిందని తెలిపారు.

ఆమె ఆరోపణలు చేస్తోన్న హీరోయిన్ ముంబైలో ఉంటుందని, నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉంటానని, మేమిద్దరం రిలేషన్ లో ఉన్నామని లావణ్య చేస్తున్నవి అసత్య ఆరోపణలు మాత్రమేనని, వాస్తవం లేవని రాజ్ తరుణ్ కొట్టిపారేశాడు. అయితే ఈ ఇష్యూలో ఎవరి కోణంలో వారి వారి అభిప్రాయాలని మీడియాకి చెబుతున్నారు. వాస్తవం ఏంటనేది ఎవరికి తెలియదు. రాజ్ తరుణ్ ఇచ్చిన స్టేట్ మెంట్స్ పైన భిన్నాభిప్రాయాలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.