మెగాకోడలు చేతుల మీదుగా వైజాగ్ బీచ్ క్లీనింగ్!
రేపు ఆదివారం నేషనల్ క్లీన్లినెస్ డే (జాతీయ పరిశుభ్రతా దినోత్సవం) కూడా కలిసి రావడంతో లావణ్య వైజాగ్ విచ్చేస్తుంది.
By: Tupaki Desk | 27 Jan 2024 5:37 AM GMTప్రధాని మోదీ తీసుకొచ్చిన 'స్వచ్ఛ భారత్' ని సెలబ్రిటీలు ఏ రేంజ్ లో వినియోగించుకున్నారో తెలిసిం దే. అందరూ చెత్త క్లీనింగ్ రోడ్లెక్కి ఫోటోలకు ఓ రేంజ్ లో పోజులిచ్చారు. పనిలో పనిగా తమ సినిమాల్ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేసుకున్నారు. క్లీనింగ్ తో పాటు వాళ్ల సినిమాలకు మంచి ప్రమోషన్ దక్కింది. అప్పట్లో ఆ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట అంతే వైరల్ అయ్యాయి. దీంతో స్చచ్ఛ భారత్ కార్య్రక్రమం మోదీ అనుకున్న దానికంటే ఎక్కువగానే పాపులర్ అయింది.
ఆ తర్వా త మళ్లీ ఏ సెలబ్రిటీ రోడ్డెక్కి చెత్త క్లీన్ చేసింది లేదు. దాన్ని పట్టించుకున్నది లేదు. ఆ రకంగా ఇదొక పెద్ద ప్రచారకమైన స్టంట్ అని జనాలకి అర్దమైంది. ఇక సాగర తీరం విశాఖపట్టణంలో ఎప్పటి కప్పుడు క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రామం ప్రతీ ఆదివారం పెద్ద ఎత్తున జరుగుతుంటుంది. ఒక్కోవారం ఒక్కో ప్రాంతాన్ని క్లీన్ చేసే కార్యక్రమంలో భాగంగా రాజకీయ నాయకులు వాళ్లతో పాటు మరికొంత మంది ప్రముఖులు పాల్గొనడం జరుగుతుంది. ఈనేపథ్యంలో తాజాగా వైజాగ్ క్లీనింగ్ కోసం మెగా కోడలు లావణ్య త్రిపాఠి కూడా రంగంలోకి దిగింది.
వివాహం తర్వాత ఆమె నటించిన 'మిస్ పర్పెక్ట్' అనే వెబ్ సిరీస్ రిలీజ్ అవుతుంది. దీనిలో భాగంగా ఆ సిరీస్ ప్రచార కార్యక్రమంలో పాల్గొంటుంది. యాదృశ్చికంగా ఈ సిరీస్ లో లావణ్య పాత్ర క్లీనింగ్ పై ఆవెర్ నేస్ తీసుకొచ్చేదే. ఇందులో ఆమె క్లీనింగ్ పట్ల ఎంతో నిబద్ధత కలిగిన అమ్మాయి పాత్రలో నటిస్తోంది. ఇప్పుడా పాత్ర వైజాగ్ లో వీకెండ్ క్లీనింగ్ సింక్ అవ్వడంతో లావణ్య కూడా రంగంలోకి దిగుతుంది. రేపు ఆదివారం నేషనల్ క్లీన్లినెస్ డే (జాతీయ పరిశుభ్రతా దినోత్సవం) కూడా కలిసి రావడంతో లావణ్య వైజాగ్ విచ్చేస్తుంది.
వేడుకలో భాగంగా ఆదివారం (జనవరి 28) విశాఖపట్నంలో బీచ్ క్లీనింగ్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో లావణ్య త్రిపాఠి కూడా పాల్గొంటుంది. ఉదయం 6గంటలకు వైఎంసీఏ బీచ్ వద్ద స్థానికు లతో కలసి పరిసరాలను క్లీన్ చేయనుంది. ఈ సందర్భంగా లావణ్య ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది. అందులో ఆమె మాట్లాడుతూ 'నాకు క్లీనింగ్ అంటే పిచ్చి . అందుకే మీ సిటీకి వస్తున్నాను. నాతో మీరంతా జాయిన్ అవ్వండి. అలాగే నా వెబ్ సిరీస్ కూడా చూడండి' అని ప్రేక్షకుల్ని కోరింది.