Begin typing your search above and press return to search.

మస్తాన్ సాయి దగ్గర లావణ్య ప్రైవేట్ వీడియో!

రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో మొదటి నుంచి వినిపిస్తోన్న పేరు మస్తాన్ సాయి.

By:  Tupaki Desk   |   13 Aug 2024 4:35 AM GMT
మస్తాన్ సాయి దగ్గర లావణ్య ప్రైవేట్ వీడియో!
X

రాజ్ తరుణ్, లావణ్య వివాదంలో మొదటి నుంచి వినిపిస్తోన్న పేరు మస్తాన్ సాయి. లావణ్య రాజ్ తరుణ్ మీద నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన తర్వాత మస్తాన్ సాయి వ్యవహారం తెరపైకి వచ్చింది. రాజ్ తరుణ్ బయటకొచ్చి మస్తాన్ సాయి తో లావణ్యకి ఎఫైర్ ఉందని, అతని మీద గుంటూరు పోలీస్ స్టేషన్ లో కేసు కూడా పెట్టిందని ఆరోపించారు. అయితే మస్తాన్ సాయి మీద రాజ్ తరుణ్ కావాలని కేసు పెట్టించాడని లావణ్య ఇన్ని రోజులు చెబుతూ వచ్చింది.

అది ఫాల్స్ కేసు అని పేర్కొంది. మస్తాన్ సాయి నాకు బెస్ట్ ఫ్రెండ్ అంటూ మీడియాలో చెప్పింది. మాల్వీ మల్హోత్రాతో ఉన్న ఎఫైర్ ని బయటపెడుతున్నానని మస్తాన్ సాయితో నాకు సంబంధం అంటగడుతున్నారు అంటూ ఆరోపించింది. మస్తాన్ సాయితో నాకు ఎలాంటి ఎఫైర్ లేదని తెలిపింది. సడెన్ గా మస్తాన్ తో లావణ్య మాట్లాడిన ఆడియో టేపులు బయటకొచ్చాయి. వాటిపై ఆమె వివరణ ఇచ్చే ప్రయత్నం చేసింది. అవేవీ కూడా నేను కావాలని మాట్లాడిన మాటలు కాదంటూ చెప్పుకొచ్చింది.

ఆవేదనతో అలా మాట్లాడానని తెలిపింది. అందులో కొన్ని ఫాబ్రికేటెడ్ అని తెలిపింది. శేఖర్ భాషా అయితే మస్తాన్, లావణ్య మధ్య ఎఫైర్ ఉందని, అలాగే ఇద్దరు డ్రగ్స్ సప్లయ్ చేస్తుంటారని ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే సడెన్ గా ఈ వ్యవహారంలో ఇంటరెస్టింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. డ్రగ్స్ కేసులో గుంటూరు పోలీసులు మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు. జూన్ 3న విజయవాడలో డ్రగ్స్ దొరికిన కేసులో మస్తాన్ సాయి నిందితుడిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఏపీ ఎన్ ఫోర్స్మెంట్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అనంతరం అతని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులకి చాలా మంది అమ్మాయిల వీడియోలు కనిపించాయి అని అంటున్నారు .

చాలా మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు మస్తాన్ సాయి సెల్ ఫోన్ లో ఉన్నట్లు గుర్తించారు. దాదాపు 800 ప్రైవేట్ వీడియోలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు. సడెన్ గా లావణ్య కూడా మస్తాన్ సాయిపై ప్లేట్ తిప్పేసింది. మస్తాన్ సాయి దగ్గర తన ప్రైవేట్ వీడియో కూడా ఉందని, దానిని పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని సంచలన ఆరోపణలు చేసింది. ఒకసారి అతని ఇంటికి వెళ్ళినపుడు సీక్రెట్ గా వీడియో రికార్డ్ చేసాడని లావణ్య ఆరోపించింది. దాంతో తనని బెదిరిస్తూ వస్తున్నాడని ఓ ఛానల్ లో సంచలన వ్యాఖ్యలు చేసింది.

దీంతో రాజ్ తరుణ్, లావణ్య వివాదంలోకి ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం కూడా వచ్చింది. ఇప్పటికే ప్రీతి అనే అమ్మాయి లావణ్య తనకి డ్రగ్స్ అలవాటు చేసిందని పోలీసులకి ఫిర్యాదు చేసింది. రాజ్ తరుణ్, లావణ్య ఫ్యామిలీ వివాదం కాస్తా ఇండస్ట్రీలో డ్రగ్స్ డొంకని కదిలించేలా ఉందనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో నెక్స్ట్ పోలీసుల యాక్షన్ ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.