Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్ గొడవ... లావణ్య తండ్రి ఏమన్నారంటే..

రాజ్ తరుణ్, లావణ్య వివాదం రోజు రోజుకి అనేక మలుపులు తిరుగుతుంది. తాజాగా లావణ్య సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది.

By:  Tupaki Desk   |   13 July 2024 9:37 AM GMT
రాజ్ తరుణ్ గొడవ... లావణ్య తండ్రి ఏమన్నారంటే..
X

రాజ్ తరుణ్, లావణ్య వివాదం రోజు రోజుకి అనేక మలుపులు తిరుగుతుంది. తాజాగా లావణ్య సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే సకాలంలో పోలీసులు లావణ్య ఇంటికి చేరుకొని ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రమాదం జరగకుండా ఆపారు. రాజ్ తరుణ్ లేని జీవితం తనకి వద్దని లావణ్య సూసైడ్ లేఖలో పేర్కొంది. మాల్వీ మల్హోత్రా రాజ్ తరుణ్ ని తననుంచి దూరం చేసింది లావణ్య వాపోయింది. అన్ని రకాలుగా తన జీవితం నాశనం చేసి రోడ్డు మీదకి వచ్చేలా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలోకి ఆమె తండ్రి వచ్చారు. కూతురికి అండగా నిలబడటానికి రెడీ అయ్యారు. నా ఆస్తి మొత్తం అమ్మేసి అయిన రాజ్ తరుణ్, లావణ్యని ఒకటి చేస్తానని, వారిద్దరికి పెళ్లి చేస్తానని ఆయన తెలిపారు. 11 ఏళ్ళు తన కూతురుతో రాజ్ తరుణ్ కలిసున్నారని, అయితే ఆధారం లేని నిందలు వేస్తూ ఇప్పుడు తన కూతురుని బజారున పడేశారని లావణ్య తండ్రి ఆరోపించారు.

రాజ్ తరుణ్ తప్పు ఒప్పుకొని తిరిగొస్తే ఇద్దరికి గ్రాండ్ గా పెళ్లి చేస్తానని, నా ఆస్థి మొత్తం అమ్మేసి అయిన వారిద్దరిని ఒకటి చేయడానికి సిద్ధమని తెలిపారు. కరోనా సమయంలో రాజ్ తరుణ్ ని అల్లుడిగా భావించి లక్షల్లో డబ్బులు సాయం చేశానని లావణ్య తండ్రి తెలిపారు. తన కూతురుకి డ్రగ్స్ అలవాటు లేదని, కావాలని రాజ్ తరుణ్ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. ఇన్నేళ్లు కాపురం చేసి ఇప్పుడు వదిలించుకోవడానికి అక్రమ సంబంధాలు అంటగడుతున్నారని వాపోయారు.

రాజ్ తరుణ్ సినిమా ఇండస్ట్రీలో ఫేమ్ ని చూసుకొని లావణ్యని దూరం పెడుతున్నాడని, ఎల్లకాలం ఇండస్ట్రీలో ఇమేజ్ ఉండదని లావణ్య తండ్రి అన్నారు. నిజంగా నా కూతురు డ్రగ్స్ తీసుకుంటే ఒక హీరో హోదాలో ఉండి ఆపాల్సింది పోయి విమర్శలు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. రాజ్ తరుణ్ ఎట్టి పరిస్థితిలో రియలైజ్ అయ్యి వెనక్కి రావాలని తన కూతురుని పెళ్లి చేసుకోవాలని లావణ్య తండ్రి అన్నారు.

ఇక ఈ వ్యవహారంపై రాజ్ తరుణ్ అయితే ఇప్పటి వరకు మీడియా ముందుకొచ్చి మాట్లాడలేదు. అయితే కేసు నమోదైన నేపథ్యంలో కచ్చితంగా వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. లావణ్య చేసిన ఆరోపణలు, కేసుపై రాజ్ తరుణ్ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.