Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్ వివాదంలో మరో ట్విస్ట్!

రాజ్ తరుణ్ ఆమె ప్రియురాలు వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   10 July 2024 9:36 AM GMT
రాజ్ తరుణ్ వివాదంలో మరో ట్విస్ట్!
X

రాజ్ తరుణ్ ఆమె ప్రియురాలు వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. రాజ్ తరుణ్ తిరగబడర సామి సినిమా హీరోయిన్ మాల్వీ మల్హోత్రాతో ఎఫైర్ పెట్టుకొని తనని దూరం పెట్టాడని, వదిలించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడని లావణ్య ఆరోపిస్తోంది. ఇప్పటికే దీనిపై లావణ్య పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో ఎవరి వాదన వారు బలంగా చెప్పుకుంటున్నారు. మాల్వీ మల్హోత్రా, ఆమె సోదరుడు తనని చంపేస్తామని బెదిరించారని లావణ్య ప్రెస్ మీట్ లో తెలియజేసింది.

అలాగే రాజ్ తరుణ్ తో తనకి వివాహం అయ్యిందని, అయితే ఇప్పుడు కాలేదని అబద్ధం చెబుతున్నాడంటూ లావణ్య చెప్పింది. పెళ్లికి సంబంధించి ఆధారాలు నా దగ్గర ఉన్నాయని పేర్కొంది. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా కూడా తిరిగి లావణ్యపై పోలీసులకి కంప్లైంట్ చేశారు. లావణ్య తనకి ఫోన్ చేసి బ్లాక్ మెయిల్ చేస్తోందని, వ్యక్తిత్వ హననం చేస్తోందని మాల్వీ మల్హోత్రా ఇప్పటికే పోలీసులకి ఫిర్యాదు చేసింది.

తాజాగా మరోసారి మాల్వీ మల్హోత్రా లావణ్యపై ఫిర్యాదు చేసింది. లావణ్య నా తమ్ముడికి రెగ్యులర్ గా బెదిరింపు మెసేజ్ లు పెడుతుందని ఆరోపించింది. రాజ్ తరుణ్ తో సినిమాలు చేసే ప్రతి హీరోయిన్ తో అతనికి ఎఫైర్ అంటగడుతుందని మాల్వీ పేర్కొంది. ఆమె మీద కేసు నమోదు చేయాలంటూ మాల్వీ మల్హోత్రాపోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిని పోలీసులు స్వీకరించారు.

రాజ్ తరుణ్ కూడా లావణ్యపై కేసు పెట్టడానికి సిద్ధం అవుతున్నాడు. ఇదిలా ఉంటే లావణ్య, రాజ్ తరుణ్ కి సంబందించిన కొన్ని ఆడియో టేపులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఒకరిని పేరు దారుణంగా దూషించుకోవడం వినిపిస్తోంది. కొన్ని అభ్యంతర పదాలతో లావణ్య, రాజ్ తరుణ్ తిట్టుకుంటున్నట్లు ఆ ఆడియో టేపుల్లో ఉంది. ఇదిలా ఉంటే లావణ్య తాజాగా రాజ్ తరుణ్ పై చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు సమర్పించింది.

అతని కారణంగా నేను గర్భవతి అయ్యానని, అబార్షన్ కూడా చేయించాడని మెడికల్ రిపోర్ట్స్ ని లావణ్య పోలీసులకి సమర్పించింది. అలాగే 170 ఫోటోలని లావణ్య పోలీసులకి ఇచ్చింది. వీటి ఆధారంగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో రాజ్ తరుణ్ పై కేసు నమోదు చేశారు. ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి 11 ఏళ్ళు సహజీవనం చేసి రాజ్ తరుణ్ మోసం చేసాడని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొంది.

రాజ్ తరుణ్ మీద కేసు నమోదు అవ్వడంతో ఇప్పుడు ఈ వ్యవహారం మరింత సీరియస్ అయ్యిందని చెప్పొచ్చు. ఈ కేసు నేపథ్యంలో పోలీసులు రాజ్ తరుణ్ పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది తెలియాల్సి ఉంది. అలాగే మాల్వీ మల్హోత్రా ఇచ్చిన ఆధారాలతో లావణ్య మీద కూడా కేసు ఫైల్ చేసే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తోంది.