ఏడు జన్మలకు లావణ్య భర్త అతడే!
అలాగని కుటుంబ సభ్యులెవరు? ఆమె స్వేచ్ఛకి భంగం కలిగించలేదు.
By: Tupaki Desk | 14 Jun 2024 3:30 PM GMTమెగా ప్రిన్స్ వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఐదారేళ్ల పాటు ప్రేమించుకుని పెద్దల్ని ఒప్పించి వివాహ బంధంతో ఒకటయ్యారు. ప్రస్తుతం వారి ధాంపత్య జీవితం సంతోషంగా సాగిపోతుంది. మెగా కోడలిగా అడుగు పెట్టిన తర్వాత ఆ ఇంటి బాధ్యతలు తీసుకుంది. అలాగని కుటుంబ సభ్యులెవరు? ఆమె స్వేచ్ఛకి భంగం కలిగించలేదు. ఆమెకు ఇవ్వాల్సినంత స్వేచ్ఛ ఇచ్చారు.
ఎంచక్కా సినిమాలు చేసుకోమన్నారు. మంచి పాత్రలు వస్తే తప్పకుండా చేస్తానని కూడా లావణ్య రివీల్ చేసింది. భర్త నుంచి అన్ని రకాలుగా సహకారం లభిస్తుంది. లావణ్య తొలి నుంచి సినిమాల పరంగా కొన్ని నియమ నిబంధనలు విధించుకునే పనిచేసింది. గ్లామర్ పాత్రలకు ఎప్పుడూ దూరంగానే ఉంది. ఇప్పుడా డిస్టెన్స్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఎంపికల విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవరించే ఛాన్స్ ఉంది. అయితే లావణ్య త్రిపాఠికి పెళ్లి అయిపోయిందని ఓ అభిమాని ఫీలైనట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఓ నెటి జనుడు ఈ జన్మకి కుదరలేదు. వచ్చే జన్మలోనైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా? అని ఓ పోస్ట్ పెట్టాడు. దానికి లావణ్య తెలివైన సమాధానం ఇచ్చింది. పెళ్లిళ్లు స్వర్గంలో నిశ్చియించబడతాయి. నేను దాన్ని బలంగా నమ్ముతా. ఈ జన్మలోనే కాదు..ఏడు జన్మలకు అతనే నా భర్త గా వస్తారని నమ్ముతున్నాను. శిస్తున్నాను అని చెప్పుకొచ్చింది.
ప్రస్తుతం ఈ పోస్టె నెట్టింట వైరల్ గా మారింది. ప్రస్తుతానికి లావణ్య త్రిపాఠి తెలుగులో సినిమాలేవి చేయలేదు. తమిళ్ లో మాత్రం `థానల్` అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా లావణ్య పెళ్లికి ముందే కమిట్ అయింది. షూటింగ్ డిలే అవ్వడంతో ఆలస్యమవుతోంది.