అడుక్కుంటా కానీ డ్రగ్స్ అమ్ముకోను - లావణ్య
ఈ సందర్భంగా లావణ్య రోజుకో కొత్త విషయాన్ని తెరపైకి తీసుకొస్తూ రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలు చేస్తోంది.
By: Tupaki Desk | 12 July 2024 4:22 AM GMTహీరో రాజ్ తరుణ్ అతని మాజీ ప్రియురాలు వివాదం రోజురోజుకు చిలికి చిలికి గాలి వానలా మారుతుంది. లావణ్య బలమైన సాక్ష్యాలు సేకరించి రాజ్ తరుణ్ తనని వదిలించుకోవడానికి ఎలాంటి ప్లాన్లు వేస్తున్నాడు అనేది ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే లాయర్ ని కూడా పెట్టుకుని చట్టపరంగా రాజ్ తరుణ్ తో ఫైట్ చేయడానికి లావణ్య సిద్ధం అయిపోయింది. మాల్వీ మల్హోత్రాలతో ఎఫైర్ పెట్టుకొని రాజ్ తరుణ్ తనని ఏ విధంగా మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నాడనేది లావణ్య మీడియాకి తెలియజేసింది.
ఈ సందర్భంగా లావణ్య రోజుకో కొత్త విషయాన్ని తెరపైకి తీసుకొస్తూ రాజ్ తరుణ్ పై సంచలన ఆరోపణలు చేస్తోంది. మీడియాతో మాట్లాడుతూ డ్రగ్స్ వ్యవహారం గురించి కూడా లావణ్య క్లారిటీ ఇచ్చింది. తనకి డ్రగ్స్ తీసుకునే అలవాటు గాని, అమ్మే అలవాటు గాని లేదని బలంగా వాయిస్ వినిపించింది. తనని డ్రగ్స్ కేసులో అక్రమంగా ఇరికించారని తెలిపింది. ఒక డ్రగ్గిస్ట్ గా, చెడిపోయిన అమ్మాయిగా, డ్రగ్స్ అమ్మేదానిగా అన్నిరకాల ముద్రలు వేసేశారని లావణ్య ఆరోపించింది.
జరిగిన పరిణామాలు అన్ని చూస్తుంటే డ్రగ్స్ కేసులో రాజ్ తరుణ్ నన్ను ఇరికించాడని అర్థమవుతోందని తెలిపింది. అలాగే బాధలో, కోపంలో తాను మాట్లాడిన మాటలని వైరల్ చేస్తూ తప్పుడు మనిషిగా చిత్రీకరిస్తున్నారని వాపోయింది. తనని ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని చేశారని లావణ్య చెప్పుకొచ్చింది. ఏమీ లేకపోతే అడుక్కుంటా కానీ డ్రగ్స్ అమ్ముకునే స్థాయికి దిగజారిపోనని తెలిపింది. డ్రగ్స్ కేసులో ఇరుక్కున్న సమయంలో కనీసం ఒక ఫ్రెండ్ గా కూడా రాజ్ తరుణ్ తన మీద కన్సర్న్ చూపించలేదని లావణ్య తన బాధని వ్యక్తం చేసింది.
మాల్వీ మల్హోత్రాతో పరిచయం అయ్యాకనే రాజ్ తరుణ్ లో మార్పు వచ్చిందని, తనని వదిలించుకోవడానికి అన్ని రకాలుగా తనని వేధిస్తూ దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని పేర్కొంది. ఈ విషయంలో నేను వెనక్కి తగ్గకపోవడంతోనే డ్రగ్స్ కేసులో ఇరికించారని అనుమానం వ్యక్తం చేసింది. న్యాయం కోసం ఎంత వరకైనా వెళ్తానని, చట్టబద్ధంగా ఫైట్ చేస్తానని లావణ్య తెలిపింది.
రాజ్ తరుణ్ తనని యాక్సప్ట్ చేసేంత వరకు ఈ ఫైట్ ఉంటుందని, చేసిన తప్పుకి శిక్ష పడి జైలుకి వెళ్ళొస్తే అయిన అతనిలో మార్పు వస్తుందని అనుకుంటున్నట్లు లావణ్య మీడియాతో చెప్పింది. అన్ని విధాలుగా తనని దెబ్బతీసి రోడ్డు మీదకి తీసుకొచ్చారని, ఇప్పుడు నాకు వేరే అప్షన్ లేదని లావణ్య తెలియజేసింది. కచ్చితంగా రాజ్ తరుణ్ తోనే తన లైఫ్ ఉంటుందని మీడియా ముఖంగా లావణ్య తన వాయిస్ ని వినిపించింది.