Begin typing your search above and press return to search.

పెళ్లి త‌ర్వాత భ‌ర‌త‌నాట్యం టీచ‌ర్ గానా?

అందులో లావ‌ణ్య కాస్త బ‌చ్చీ లుక్ లో క‌నిపిస్తున్నారు.లేడీ ట్రైయిన‌ర్ స‌మ‌క్షంలో క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   27 July 2023 6:14 AM GMT
పెళ్లి త‌ర్వాత భ‌ర‌త‌నాట్యం టీచ‌ర్ గానా?
X

లావ‌ణ్య త్రిపాఠి కొన్ని నెల‌ల్లో మెగా ఇంట కోడ‌లిగా అడుగు పెట్ట‌బోతున్నారు. వ‌రుణ్ తేజ్ ని వివాహం చేసుకుని కుటుంబ బాధ్య‌త‌లు తీసుకోబోతున్నారు. ఇప్ప‌టికే కుటుంబ స‌భ్యుల స‌మ‌క్షంలో గ్రాండ్ గా నిశ్చితార్ధం జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. వివాహం త‌ర్వాత సినిమాల్లో కొన‌సాగుతారా? లేదా? అన్న‌ది దానిపై స‌రైన క్లారిటీ లేదు. కానీ పెళ్లి త‌ర్వాత లావ‌ణ్య సినిమాల‌కు రిటైర్మెంట్ ఇచ్చి న‌మ్ర‌త శిరోద్క‌ర్ లా ఓ సాధార‌ణ గృహిణిలా జీవితాన్ని సాగిస్తార‌నే ప్ర‌చారం ఉంది.

ప్ర‌స్తుతం ఆమె ఎలాంటి సినిమాల‌కు ఒప్పందం చేసుకోలేదు. కోలీవుడ్ లో 'థాన‌ల్' అనే సినిమా చేస్తున్నారు. ఆ సినిమా కూడా షూటింగ్ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. ఆ సినిమా ప్ర‌చారానికి లావ‌ణ్య హాజ‌ర‌య్యే అవ‌కాశాలున్నాయి.

ఆ త‌ర్వాత ఆమె మ‌ళ్లీ మీడియాలో క‌నిపించే అవకాశాలు త‌క్కువ‌గానే ఉన్నాయి. తెలుగులో అయితే ఏ సినిమాలు లైన‌ప్ లోనూ లేవు. తాజాగా లావ‌ణ్య జిమ్ములో వ‌ర్కౌట్లు చేస్తోన్న కొన్ని ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

అందులో లావ‌ణ్య కాస్త బ‌చ్చీ లుక్ లో క‌నిపిస్తున్నారు.లేడీ ట్రైయిన‌ర్ స‌మ‌క్షంలో క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. సాధార‌ణంగా హీరోయిన్ల‌కు అయినా మేల్ ట్రైనేర్లు ఉంటారు. కానీ లావ‌ణ్య పీమేల్ ట్రైన‌ర్ల‌తో ప‌నిచేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఆరెంజ్ క‌ల‌ర్ జిమ్ దుస్తుల్లో లావ‌ణ్య క‌నిపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో లావ‌ణ్య కెరీర్ సంబంధించి ఓ కొత్త విష‌యం వెలుగులోకి వ‌స్తోంది. సినిమాల‌కు దూర‌మై..శాస్త్రీయ నృత్యంపై ఏకాగ్ర‌త చూపిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. మ్యాక‌ప్ వేసుకోవ‌డానికి బ‌ధులుగా వివాహం త‌ర్వాత లావ‌ణ్య కొత్త కెరీర్ ని ఎంపిక చేసుకునే ప్లాన్ లో ఉన్న‌ట్లు వినిపిస్తోంది.

లావ‌ణ్య స్కూల్ డేస్ నుంచే శాస్త్రీయ నృత్యం పై ప‌ట్టు సాధించారు. భ‌ర‌త‌నాట్యం చేయ‌డంలో హీరోయిన్లు అంద‌రికంటే స్పెష‌ల్ గా లావ‌ణ్య ని చెప్పుకుంటారు. 'భ‌లే భలే మగాడివోయ్' సినిమాలో భరత నాట్యం చేసిన సంగ‌తి తెలిసిందే. చ‌దువుకునే స‌మ‌యంలోనే మిస్ ఉత్తరాఖండ్ టైటిల్ కైవసం చేసుకున్నారు.