Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ప్ర‌మాణ స్వీకారంలో మెగా కోడలు మిస్సింగ్?

త‌న కాలికి క‌ట్టు క‌ట్టి ఉండ‌డంతో ఈ ప్ర‌చారం మొద‌లైంది. కాలి గాయం వ‌ల్ల‌నే ఈరోజు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి లావ‌ణ్య హాజ‌రు కాలేద‌ని ప్ర‌చారం సాగుతోంది.

By:  Tupaki Desk   |   12 Jun 2024 2:47 PM GMT
ప‌వ‌న్ ప్ర‌మాణ స్వీకారంలో మెగా కోడలు మిస్సింగ్?
X

ఇటీవ‌లే మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ కాలికి చిన్న‌పాటి శ‌స్త్ర చికిత్స జ‌రిగింద‌ని క‌థ‌నాలొచ్చాయి. కానీ అది నిజం కాద‌ని అత‌డు ఖండించాడు. త‌న‌కు మెడ నొప్పి ఉంద‌ని, లైట్ తీస్కోమ‌ని అన్నాడు. త‌న కాలికి శ‌స్త్ర చికిత్స జ‌రిగింద‌న్న ప్ర‌చారం ఎలా పుట్టుకొచ్చిందో అంటూ ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసాడు. కొన్నాళ్ల క్రితం లండ‌న్ లో సుదీర్ఘంగా త‌న భార్య లావ‌ణ్య‌తో విహార యాత్ర‌ను ఆస్వాధించిన సంగ‌తి తెలిసిందే.

కానీ ఇంత‌లోనే ఇప్పుడు మెగా కోడ‌లు, వ‌రుణ్ తేజ్ భార్యామ‌ణి లావ‌ణ్య త్రిపాఠి కాలి గాయానికి చికిత్స జ‌రిగింద‌ని చెబుతున్నారు. త‌న కాలికి క‌ట్టు క‌ట్టి ఉండ‌డంతో ఈ ప్ర‌చారం మొద‌లైంది. కాలి గాయం వ‌ల్ల‌నే ఈరోజు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌మాణ స్వీకార కార్య‌క్ర‌మానికి లావ‌ణ్య హాజ‌రు కాలేద‌ని ప్ర‌చారం సాగుతోంది. త‌న కుడి కాలికి గాయ‌మైంద‌ని, కోలుకుంటున్నానని లావ‌ణ్య స్వ‌యంగా సోష‌ల్ మీడియాల్లో వెల్ల‌డించ‌డంతో దీనిపై క్లారిటీ వ‌చ్చేసింది. కాలి గాయానికి సంబంధించిన లావ‌ణ్య షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ ఇప్పుడు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతోంది.

పెళ్లికి ముందు లావ‌ణ్య కెరీర్ ప‌రంగా ఫుల్ బిజీగా ఉంది. కానీ ఇప్పుడు రిలాక్స్‌డ్ గా ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది. అలాగే పెళ్లికి ముందు లావ‌ణ్య న‌టించిన త‌మిళ చిత్రం విడుద‌ల‌కు రావాల్సి ఉంది. తెలుగులో ఇప్ప‌టివ‌ర‌కూ కొత్త సినిమాని ప్ర‌క‌టించ‌లేదు. ప్ర‌స్తుతానికి వ‌రుణ్ తో త‌న ల‌వ్ లైఫ్‌ని ఈ అందాల రాక్ష‌సి ఆస్వాధిస్తోంది.