Begin typing your search above and press return to search.

మెగా కోడ‌లు స్టైలిష్ లుక్!

లావ‌ణ్య త్రిపాఠి మెగాకోడ‌లిగా ఇంట అడుగు పెట్టిన నాటి నుంచి కొత్త సినిమా అప్ డేట్ ఎప్పుడొస్తుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు.

By:  Tupaki Desk   |   9 July 2024 8:04 AM GMT
మెగా కోడ‌లు స్టైలిష్ లుక్!
X

లావ‌ణ్య త్రిపాఠి మెగాకోడ‌లిగా ఇంట అడుగు పెట్టిన నాటి నుంచి కొత్త సినిమా అప్ డేట్ ఎప్పుడొస్తుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఆమె నుంచి ఇంత‌వ‌ర‌కూ ఎలాంటి అప్ డేట్ రాలేదు. సినిమాలు చేసుకునే స్వేచ్ఛ క‌ల్పించింది. న‌టిగా కొన‌సాగుతాన‌ని లావ‌ణ్య కూడా క్లారిటీ ఇచ్చింది. కానీ ఇంత వ‌ర‌కూ కొత్త సినిమా ముచ్చ‌టేది? వినిపించ‌లేదు. మెగా ఫ్యామిలీతో మాత్రం ఎంతో బాగా క‌లిసిపోయింది.


ఆ ఫ్యామిలీ లో మ‌హిళ‌లు మిన‌హాయిస్తే మిగ‌తా వారంతా న‌టులే కావ‌డంతో మింగిల్ అవ్వ‌డానికి పెద్ద‌గా స‌మ‌యం ప‌ట్ట‌లేదు. ఈజీగా వాళ్ల‌తో క‌లిసిపోయింది. అత్త‌మ్మ‌తో ఇంట్లో వంట కార్య‌క్ర‌మాలు....వ‌రుణ్ తో సినిమా ముచ్చ‌ట్ల‌తో టైంపాస్ చేస్తోంది. అలాగే ఇన్ స్టా ద్వారా అభిమానుల‌కు ట‌చ్ లో ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోలు షేర్ చేస్తే క‌నిపిస్తుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా లావ‌ణ్య మ‌రో స్టైలిఫ్ ఫోటోతో నెటిజ‌నుల ముందుకొచ్చింది.

ఇదిగో ఇక్క‌డిలా వైట్ క‌ల‌ర్ ప్యాంట్.. టీష‌ర్ట్ ధ‌రించి వాల్ స‌పోర్ట్ తో స్టైలిష్ కెమారాకి ఫోజులిచ్చింది. ఈ ఫోటోని ఉద్దేశించి ఇంట్రెస్టింగ్ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. తెలివైన శిర్షిక‌లు అన్నీ అయిపోతున్నాయని రాసుకొచ్చింది. అంటే లావ‌ణ్య మీనింగ్...కొత్త‌గా ఎలాంటి భంగిమ‌లు ఎంచుకోవాలో? అర్దం కానీ క‌న్ ప్యూజ‌న్ లో ప‌డిన‌ట్లు క‌నిపిస్తుంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. లావ‌ణ్య అభిమానులు త‌మ‌దైన శైలిలో కామెంట్లు గుప్పిస్తున్నారు.

లావ‌ణ్య వెండి తెర‌పై క‌నిపించి రెండేళ్లు దాటింది. చివ‌రిగా హ్యాపీ బ‌ర్త్ డేలో న‌టించింది. ఆ త‌ర్వాత త‌మిళ్ లో `తాన‌ల్` అనే సినిమా క‌మిట్ అయింది. ఆ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్ర‌స్తుతం నిర్మాణానంత‌ర ప‌నులు జ‌రుగుతున్నాయి. రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ లావ‌ణ్య పెళ్లికి ముందే సైన్ చేసింది. అలాగే వెబ్ సిరీస్ లు కూడా చేసిన సంగ‌తి తెలిసిందే.