అత్తమామలు, భర్తతో లావణ్య త్రిపాఠి వినాయక పూజ
ఫోటోను షేర్ చేస్తూ, వరుణ్ - లావణ్య ఇలా రాశారు, ''వినాయక చవితి శుభాకాంక్షలు! మీ అందరికీ గొప్ప ఆరోగ్యం & శ్రేయస్సు కావాలని కోరుకుంటున్నాను.
By: Tupaki Desk | 19 Sep 2023 3:45 AM GMTఇది అరుదైన దృశ్యం. నిశ్చితార్థం తర్వాత తొలి బిగ్గెస్ట్ సెలబ్రేషన్.. లావణ్య త్రిపాఠి ఈ శుభవేడుకను ఎంతగానో ఆస్వాధిస్తోంది. విఘ్నవినాయకునికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించే వినాయక చవితి వేడుకలను అత్త మామలు, ఆయనతో కలిసి జరుపుకుంది లావణ్య త్రిపాఠి.
లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న జంట. వరుణ్ తల్లిదండ్రులు నాగ బాబు కొణిదెల- పద్మజ కొణిదెలతో కలిసి లావణ్య -వరుణ్ పోజులిచ్చిన ఫోటో ఇప్పుడు అభిమానుల్లో వైరల్ గా మారింది. ఫోటోలో లావణ్య ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపించింది. నీలం పసుపు రంగు చీరను ధరించింది. వరుణ్ ఆకుపచ్చ పొట్టి కుర్తా- తెలుపు పైజామా ధరించాడు. ఈ వేడుకలకు వరుణ్ సోదరి నిహారిక కొణిదెల కనిపించలేదు.
ఫోటోను షేర్ చేస్తూ, వరుణ్ - లావణ్య ఇలా రాశారు, ''వినాయక చవితి శుభాకాంక్షలు! మీ అందరికీ గొప్ప ఆరోగ్యం & శ్రేయస్సు కావాలని కోరుకుంటున్నాను. నిన్ను మిస్ అవుతున్నాను నిహారిక..'' అని రాసారు. లాస్ ఏంజిల్స్‌లోని ముల్‌హోలాండ్ డ్రైవ్ హాలీవుడ్‌ను సందర్శిస్తున్నట్లు నిహారిక వెల్లడించిన సంగతి తెలిసిందే. గత వారం నిహారిక US నుండి ఫోటోలను షేర్ చేసింది.
నవంబర్‌లో వరుణ్ - లావణ్య డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట, ఇటలీలోని సుందరమైన నేపథ్యంలో డెస్టినేషన్ వెడ్డింగ్ కి ప్రిపరేషన్ లో ఉన్నారు. పెళ్లి వేదిక ఇంకా లాక్ కాలేదని వరుణ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.
వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠిల ప్రేమకథ వారి మొదటి చిత్రం 'మిస్టర్' సెట్స్‌లో వికసించింది. వారి సంబంధం గురించి వరుణ్ మాట్లాడుతూ తమ స్నేహం క్రమంగా ప్రేమగా మారిందని తెలిపాడు. ప్రైవేట్ వ్యక్తిగా ఉండేందుకు ఇష్టపడే వరుణ్ తల్లిదండ్రులకు వారి బంధం గురించి తెలుసునని తెలిపాడు. వారు తమ నిశ్చితార్థాన్ని అధికారికంగా ప్రకటించే వరకు రహస్యంగా ఉంది.
ఒక ఇంటర్వ్యూలో లావణ్యను తొలిగా సంప్రదించింది తానేనని వరుణ్ వెల్లడించాడు. తమ సంబంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి సమయం ఆసన్నమైందని లావణ్యతో చెప్పానని, తను వెంటనే అంగీకరించిందని చెప్పాడు. లావణ్య ప్రశాంత స్వభావమే ఆమెలో తనకు బాగా నచ్చిందని తమ సంబంధాన్ని స్థిరంగా ఉంచింది అని కూడా చెప్పాడు.