లావణ్యతో వరుణ్ తొందరపడేదే లేదా?
మరి లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ మళ్లీ జంటగా సినిమా చేస్తారా? అనే ప్రశ్న వరుణ్ ముందుకెళ్తే ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
By: Tupaki Desk | 27 Feb 2024 9:42 AM GMTవరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ధాపత్య జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. అలాగే ఎవరి సినిమా పనుల్లోనూ వాళ్లు బిజీగా ఉన్నారు. నిన్న మొన్నటివరకూ లావణ్య త్రిపాఠిన తన వెబ్ సిరీస్ పనుల్లో బిజీగా ఉంది. అలాగే తదుపరి చేయబోయే సినిమాల గురించి రివీల్ చేసింది. ప్రస్తుతం వరుణ్ తేజ తన సినిమా 'ఆపరేషన్ వాలంటైన్' ప్రమోషన్ లో బిజీగా ఉన్నాడు.
రిలీజ్ సమయం దగ్గర పడటంతో ఉన్న సమయాన్ని మీడియా ఇంటర్వ్యూలకే కేటాయిస్తున్నాడు. పెళ్లైన తర్వాత రిలీజ్ అవుతున్న మొదటి చిత్రం కావడంతో కాస్త టెన్షన్ గాను కనిపిస్తున్నాడు. కొత్తగా జీవితంలో లావణ్య వచ్చింది హిట్ వస్తుందా? ప్లాప్ వస్తుందా? అన్న టెన్షన్ కనిపిస్తోంది. అభిమానులంతా ఆ సినిమా హిట్ అవ్వాలని అంతా కోరుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
మరి లావణ్య త్రిపాఠి-వరుణ్ తేజ్ మళ్లీ జంటగా సినిమా చేస్తారా? అనే ప్రశ్న వరుణ్ ముందుకెళ్తే ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఇద్దరికి తగ్గ స్టోరీ ఏ దర్శకుడైనా తెచ్చి వినిపించి మెప్పిస్తే తప్పకుండా కలిసి పనిచేస్తాం అన్నాడు. అందులో ఎలాంటి అభ్యంతరం లేదు అని క్లారిటీ ఇచ్చాడు. ఏదో కలిసి పనిచేయాలని తొందర పడిమాత్రం సినిమా చేయమం అని..మంచి కథ కుదిరితే తప్పకుండా నటిస్తాం అని తెలిపాడు.
గతంలో ఇద్దరు 'మిస్టర్'..'అంతరిక్షం' సినిమాల్లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. 'మిస్టర్' తో ప్రేమ మొదలైతే..అంతరిక్షంతో డీప్ గా వెళ్లింది. ముచ్చటగా మూడవ సినిమా భార్యభర్తలు అయిన సందర్భంగానూ రెడీ అవుతున్నారు. మరి ఆ ఛాన్స్ ఏ దర్శకుడు తీసుకుంటాడు? అన్నది చూడాలి. లావణ్య కూడా వివాహం తర్వాత సినిమాలు చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. పెళ్లైనా అత్తింటి కుటుంబం నుంచి ఎలాంటి కండీషన్లు లేవని..కావాల్సినంత స్వేచ్ఛ అక్కడ ఉంది అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.