ప్రేమ ఉన్నచోట యక్షిణులు ఉంటారు: లావణ్య కొణిదెల
ఈ ఫోటోగ్రాఫ్స్ లో లావణ్య బ్లాక్ కలర్ డిజైనర్ గౌన్ ని ధరించింది. ఇది భారీతనంతో ఉన్న అందమైన గౌన్.
By: Tupaki Desk | 27 Nov 2023 4:24 AM GMT"ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ యక్షిణులు ఉంటారు!" .. లావణ్య త్రిపాఠి కొణిదెల లేటెస్ట్ కోట్ ఇది. ఇటలీ టస్కనీలో వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నుంచి అరుదైన క్షణాలకు సంబంధించిన ఫోటోలను లావణ్య ఇటీవల సోషల్ మీడియాల్లో ఒక్కొక్కటిగా షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఫోటోల ఆర్చీవ్స్ లోంచి అరుదైన ఫోటోషూట్ వెలుగు చూసింది. ఇందులో వరుణ్- లావణ్య ఎంతో ముచ్చటగా కనిపిస్తున్నారు. టుస్కానీలోని వెడ్డింగ్ వెన్యూ బోర్గో శాన్ ఫిలైస్ వద్ద అరుదైన ఫోటోషూట్ కి సంబంధించిన ఈ ఫోటోలు ఎంతో రొమాంటిక్ మూడ్ తో కనిపిస్తున్నాయి. అందమైన ప్రకృతిలో ఈ జంట రొమాంటిక్ గా ఫోజులివ్వగా వాటిని కెమెరా క్యాప్చుర్ చేసిన విధానం ఆకట్టుకుంది.
ఈ ఫోటోగ్రాఫ్స్ లో లావణ్య బ్లాక్ కలర్ డిజైనర్ గౌన్ ని ధరించింది. ఇది భారీతనంతో ఉన్న అందమైన గౌన్. ఈ లుక్ కోసం లావణ్య ఎంపిక చేసిన హెయిర్ స్టైల్.. హై హీల్స్ వగైరా ప్రత్యేక ఆకర్షణను పెంచాయి. వరుణ్ తేజ్ ట్రెడిషనల్ దుస్తులు ధరించి, కళ్లకు గాగుల్స్ తో ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. లావణ్య బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో కొన్ని ఫోజులు ఇచ్చినా, అంతకుమించి వరుణ్ తేజ్ తో రొమాంటిక్ ఫోజులు ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి.
ప్రస్తుతం వరుణ్ ఏం చేస్తున్నాడు?
ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన వరుణ్ తేజ్ తిరిగి షూటింగుల్లో చేరేందుకు సిద్ధమయ్యాడు. తదుపరి చిత్రం మట్కాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంతకుముందే వెలువడిన సంగతి తెలిసిందే. గాండీవధారి అర్జున తర్వాత వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రమిది. మట్కా వరుణ్ కెరీర్ 14వ సినిమా. 1958-1985 మధ్య కాలంలో వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మేకర్స్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో వైజాగ్ ఓల్డ్ సిటీని తలపించే సెట్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం వరుణ్ తేజ్ జిమ్ చేసి తిరిగి ట్రిమ్ లుక్ లోకి మారనున్నాడు. దీనికోసం అతడు గత కొన్ని నెలలుగా శిక్షణ పొందుతున్నాడు. ఈ చిత్రంలో తొమ్మిది యాక్షన్ ఎపిసోడ్‌లు ఉంటాయని కూడా తెలుస్తోంది. వరుణ్ తేజ్ ఇప్పటివరకు నటించిన చిత్రాల్లో భారీ యాక్షన్ తో రూపొందుతున్న సినిమా కూడా ఇదేనని తెలుస్తోంది.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన 'గాండీవధారి అర్జున' కూడా హైఆక్టేన్ యాక్షన్ చిత్రం. కానీ ఈ సినిమా దురదృష్టవశాత్తూ బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్లను సాధించడంలో విఫలమైంది. మట్కా చిత్రీకరణ 2023 డిసెంబర్‌లో ప్రారంభమవుతుంది. 2024లో విడుదలవుతుంది. దీనికి ముందు వరుణ్ నటించిన 'ఆపరేషన్ వాలెంటైన్' విడుదలవుతుంది. ఇందులో మాజీ మిస్ యూనివర్శ్ మానుషి చిల్లర్ కథానాయికగా నటించింది. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది.