లావణ్య పెళ్లి రిసెప్షన్ చీర స్టోరీ తెలుసా..!
రిసెప్షన్ చీర ఖరీదు 2.75 లక్షలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొద్ది మంది మాత్రం అంతకు డబుల్ ఉంటుంది.
By: Tupaki Desk | 6 Nov 2023 10:29 AM GMTవరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం అత్యంత వైభవంగా ఇటలీ లో జరిగిన విషయం తెల్సిందే. పెళ్లి వేడుక లో మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు. నిన్న ఆదివారం జరిగిన వివాహ రిసెప్షన్ లో ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది ప్రముఖులు హాజరు అయ్యారు.
రిసెప్షన్ లో వరుణ్ మరియు లావణ్య త్రిపాఠి ధరించిన కాస్ట్యూమ్స్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముఖ్యంగా లావణ్య త్రిపాఠి కట్టుకున్న బంగారు వర్ణం చీర ను ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేయడం జరిగిందట. బాలీవుడ్ తో పాటు ఎంతో మంది సౌత్ ఇండియన్ సెలబ్రిటీలకు కూడా ఆయన ఖరీదైన చీరలు ఇతర డ్రెస్ లను డిజైన్ చేయడం జరిగింది.
లావణ్య త్రిపాఠి ఫిజిక్ మరియు ఆమె స్కిన్ టోన్ కి సెట్ అయ్యే విధంగా ఈ చీర ను డిజైన్ చేయడం జరిగిందట. ఇదే తరహా మోడల్ చీరను గతంలో షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ ధరించి ఉన్న ఫోటోలు మరోసారి ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి లావణ్య హుందాగా కనిపించడంతో పాటు అందంగా కనిపించేందుకు గాను ఈ చీర బాగా ఉపయోగపడింది. పెళ్లి లో లావణ్య కట్టుకున్న ఎర్ర చీర ఖరీదు రూ. 10 లక్షలుగా సమాచారం అందుతోంది.
రిసెప్షన్ చీర ఖరీదు 2.75 లక్షలుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కొద్ది మంది మాత్రం అంతకు డబుల్ ఉంటుంది. మనీష్ మల్హోత్ర డిజైన్ చేసిన ఆ చీర లో లావణ్య మెరిసి పోతుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. వరుణ్ పక్కన చాలా అందంగా కనిపిస్తుంది అని కూడా మెగా ఫ్యాన్స్ కితాబిస్తున్నారు.