Begin typing your search above and press return to search.

మా గ్యాంగ్ ఇంకా యాక్టివ్‌గా ఉంది.. స్టార్ హీరోని చంపుతాం!

లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి మరొక బెదిరింపు. స‌ల్మాన్ స్వ‌యంగా బిష్ణోయ్ క‌మ్యూనిటీ ఆలయాన్ని సందర్శించి, కృష్ణ జింకను చంపినందుకు క్షమాపణ చెప్పాలని, లేదా రూ.5 కోట్లు చెల్లించాలని ఈ మెసేజ్‌లో డిమాండ్ చేసారు.

By:  Tupaki Desk   |   5 Nov 2024 6:44 AM GMT
మా గ్యాంగ్ ఇంకా యాక్టివ్‌గా ఉంది.. స్టార్ హీరోని చంపుతాం!
X

చెప్పింది చేయ‌క‌పోతే చంపేస్తాం! సారీ చెప్ప‌క‌పోయినా లేపేస్తాం!! నీకు ప్రాణాల మీద ఆశ లేదా? 5 కోట్లు చెల్లించు.. డైరెక్టుగా మా కులదైవం కొలువున్న‌ ఆల‌యానికి నువ్వు రావాలి. వ‌చ్చి కృష్ణ జింక‌ను చంపినందుకు సారీ చెప్పు.. లేదంటే ఇదే లాస్ట్ వార్నింగ్. నిన్ను చంపేస్తాం.. ఇదీ స్టార్ హీరోపై బెదిరింపులు. ఇప్పుడు ఇలాంటి మ‌రో బెదిరింపుతో అత‌డి గుండెల్లో డేంజ‌ర్ అలార్మ్ మోగింది. చుట్టూ భ‌ద్ర‌తా సిబ్బంది హైటెన్ష‌న్ లో ఉన్నారు.

ఈ బెదిరింపులు ఎవ‌రికో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌ని లేదు. గ‌త కొంత‌కాలంగా వ‌రుస బెదిరింపుల‌కు గుర‌వుతున్న బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కి తాజాగా వ‌చ్చిన‌ బెదిరింపు ఇది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుండి మరొక బెదిరింపు. స‌ల్మాన్ స్వ‌యంగా బిష్ణోయ్ క‌మ్యూనిటీ ఆలయాన్ని సందర్శించి, కృష్ణ జింకను చంపినందుకు క్షమాపణ చెప్పాలని, లేదా రూ.5 కోట్లు చెల్లించాలని ఈ మెసేజ్‌లో డిమాండ్ చేసారు.

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడిగా చెప్పుకునే వ్యక్తి నుండి ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్‌కు సోమవారం ఈ మెసేజ్ వచ్చింది. త‌మ‌ డిమాండ్‌లను పాటించడంలో విఫలమైతే సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బెదిరించాడు. ''సల్మాన్ ఖాన్ సజీవంగా ఉండాలనుకుంటే అతడు మా (బిష్ణోయ్ కమ్యూనిటీ) ఆలయానికి వెళ్లి క్షమాపణ చెప్పాలి లేదా రూ.5 కోట్లు చెల్లించాలి. అతడు అలా చేయకపోతే, మేము అతడిని చంపుతాము. మా గ్యాంగ్ ఇంకా యాక్టివ్‌గా ఉంది'' అని మెసేజ్‌లో పేర్కొన్నారు.

బెదిరింపు మెసేజ్ ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో సోర్స్ ని వెతుకుతున్నారు పోలీసులు. సల్మాన్ ఖాన్‌కు భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. హత్యాయత్నం, దోపిడీ సహా ర‌క‌ర‌కాల‌ ఆరోపణలపై జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ కి ఈ మెసేజ్‌కి సంబంధం ఏమిటో కూడా పోలీసులు తనిఖీ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్‌కు బెదిరింపు సందేశం కేసులో వర్లీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. మెసేజ్ వచ్చిన నంబర్‌ను ట్రేస్ చేస్తున్నారు! అని ఏ.ఎన్.ఐ పేర్కొంది.