Begin typing your search above and press return to search.

రాజ్ తరుణ్, లావణ్య పెళ్లి.. ఇదే సాక్ష్యం

లావణ్యకి న్యాయం జరిగే వరకు పోరాడుతామని కళ్యాణ్ దిలీప్ సుంకర మీడియాకి తెలియజేశారు.

By:  Tupaki Desk   |   11 July 2024 6:17 AM GMT
రాజ్ తరుణ్, లావణ్య పెళ్లి.. ఇదే సాక్ష్యం
X

రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ పైన నార్సింగ్ పోలీసులు కేసు ఫైల్ చేయగా నోటీసులు కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. లావణ్య రాజ్ తరుణ్ తో తనకున్న రిలేషన్ గురించి బలమైన ఆధారాలని సేకరించి పోలీసులకి అందించింది. లావణ్య తరుపున హైకోర్టు లాయర్ కళ్యాణ్ దిలీప్ సుంకర ఫైట్ చేస్తున్నారు. లావణ్యకి న్యాయం జరిగే వరకు పోరాడుతామని కళ్యాణ్ దిలీప్ సుంకర మీడియాకి తెలియజేశారు.

తాజాగా ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ రాజ్ తరుణ్ లావణ్యని గోవాకి తీసుకెళ్లి వివాహం చేసుకున్నాడని, ఆమె మెళ్ళో ఉన్న నల్లపూసల దండ దీనికి సాక్ష్యం అని తెలిపారు. అలాగే 2017 నుంచి లావణ్యతో తనకి శారీరక సంబంధం లేదని రాజ్ తరుణ్ మీడియాకి తెలిపాడు. దీనిపైనా కళ్యాణ్ దిలీప్ సుంకర ఫోటోలని చూపించారు. 2017లోనే లావణ్యకి రెండు సార్లు అబార్షన్ చేసాడని, ఈ గర్భానికి కారణం ఎవరు. ఆమెకి అబార్షన్ ఎలా జరిగిందో రాజ్ తరుణ్ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజ్ తరుణ్ తల్లి, తండ్రి లావణ్యని అమెరికాకి పంపించే సమయంలో దిగిన వీడియో ప్రూఫ్ లు వారిద్దరి రిలేషన్ కి బలమైన సాక్ష్యం అని కళ్యాణ్ దిలీప్ సుంకర తెలిపారు. రాజ్ తరుణ్ లావణ్య కి డైవర్స్ కావాలని మెసేజ్ లు చేసాడని, వాటిలో డబ్బులు, ఇల్లు, స్థలం ఆఫర్ చేసాడని, ఇప్పుడు తిరిగి ఆమెపైన అసత్య ఆరోపణలు చేస్తున్నాడని కళ్యాణ్ దిలీప్ అన్నారు. లావణ్య చౌదరి డ్రగ్స్ కి అలవాటు పడిందని రాజ్ తరుణ్ ఆరోపణలు చేస్తున్నాడు.

నీ సంరక్షణలో ఉన్న అమ్మాయి డ్రగ్స్ కి అలవాటు పడితే ఆమెని రీహాబిలేషన్ కి పంపించి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత నీకు ఉంటుంది కదా అని రాజ్ తరుణ్ ని ప్రశ్నించారు. ఆమె డ్రగ్స్ కి అలవాటు పడిందని ఏ ఆధారాలతో చెబుతున్నావ్ అంటూ రాజ్ తరుణ్ ని అడిగారు. అలాగే మాల్వీ మల్హోత్రా ఉన్న ఎఫైర్ ని డైవర్ట్ చేసేందుకు మస్తాన్ సాయిని తెరపైకి తెచ్చాడని కళ్యాణ్ దిలీప్ సుంకర అన్నారు.

లావణ్య పై దాడి చేసి, లేదంటే దాడి చేసుకునేలా రాజ్ తరుణ్ ప్రేరేపించారని కళ్యాణ్ దిలీప్ సుంకర అన్నారు. లావణ్య ఒంటిపై ఉన్న గాయాల ఫోటోలని కూడా చూపించారు. రెచ్చగొడితే ఏ ఆడపిల్ల అయిన గట్టిగా మాట్లాడుతుందని, వాటిని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కచ్చితంగా తమ దగ్గర ఉన్న ఆధారాలతో లావణ్యకి హైకోర్టులో న్యాయం జరుగుతుందని కళ్యాణ్ దిలీప్ సుంకర తెలియజేసారు. రాజ్ తరుణ్ తప్పైపోయిందని చెప్పి ఆమెని భార్యగా స్వీకరించాల్సిందే తప్ప మరో మార్గం అతనికి లేదని అన్నారు.