ఆయన పేరిప్పుడు చరిత్రలో ఓ సంచలనం!
`ఛావా` బ్లాక్ బస్టర్ అవ్వడంతో దర్శకుడు లక్ష్మణ్ ఉట్టేకర్ పేరు బాలీవుడ్ లో సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 17 Feb 2025 5:30 PM GMT`ఛావా` బ్లాక్ బస్టర్ అవ్వడంతో దర్శకుడు లక్ష్మణ్ ఉట్టేకర్ పేరు బాలీవుడ్ లో సంచలనంగా మారింది. `స్త్రీ2` తర్వాత బాలీవుడ్ కి మరో భారీ విజయాన్ని అందించిన దర్శకుడిగా నీరాజనాలు అందుకుం టున్నాడు. నాలుగు రోజుల్లోనే సినిమా 150 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. పోటీగా మరో హిందీ చిత్రం కూడా లేదు. దీంతో బాక్సాఫీస్ వద్ద ఎదురు లేని చిత్రంగా దూసుకుపోతుంది. సినిమాకి మంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి.
దీంతో థియేటర్లన్నీ హౌస్ పుల్ అవుతున్నాయి. ఇంకా తెలుగు వెర్షన్ అందుబాటులో ఉంటే? సినిమా వసూళ్లు ఇంకా వేగంగా ఉండేవి. 200 కోట్ల మార్క్ ను ఇప్పటికే దాటేసేది కూడా. `ఛత్రపతి` శివాజీ వారసుడు శంభాజీ మహారాజ్ కథను తెరపై ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మరాఠా సామ్రాజ్యం- మోఘల్ సామ్రాజ్యాల మధ్య యుద్ద సన్నివేశాలు ప్రేక్షకుల్నిఎంతగానో ఆకటుట కుంటున్నాయి.
దర్శకుడు లక్ష్మణ్ ఉట్టేకర్ మేకింగ్ విధానంతో కట్టి పడేసాడు. ఈ సినిమాతో లక్ష్మణ్ స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు. లక్ష్మణ్ ఉట్టేకర్ చారిత్రాత్మక నేపథ్యంగల సినిమా తీయడం ఇదే తొలిసారి. గతంలో ఎప్పుడూ ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు. లవ్ స్టోరీలు, రొమాంటిక్ కామెడీ స్టోరీలు సహా వివిధ జోనర్లలో సినిమాలు చేసాడు తప్ప చరిత్రను తెరకెక్కించడం మాత్రం ఇదే తొలిసారి.
తొలి అటెంప్ట్ లో నే ఎక్కడా తప్పదాలు కనిపించలేదు. చరిత్రలను తీసిన అనుభవం ఉన్న దర్శకు డిలాగా కథని అద్భుతంగా తెరపై ఆవిష్కరించాడు. సాధారణంగా బాలీవుడ్ హిస్టరీ నేపథ్యం గల సినిమాలు తీయాలంటే అశుతోష్ గోవారికర్, సంజయ్ లీలా భన్సాలీ పేర్లు వినిపిస్తాయి. ఇప్పుడు వాళ్ల సరసన లక్ష్మణ్ ఉట్టేకర్ చేరిపోయారు.