బాలయ్య - బోయపాటి కాంబో మూవీలో స్టార్ కిడ్
అఖండ సినిమాలో చిన్న పాప పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పాప పాత్రను మరింతగా అఖండ 2 లో చూపించేందుకు దర్శకుడు బోయపాటి ప్లాన్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 14 Dec 2024 6:30 AM GMTనందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న డాకు మహారాజ్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధం అయ్యింది. సంక్రాంతి కానుకగా డాకు మహారాజ్ విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ తదుపరి సినిమా ప్రారంభం అయ్యింది. సినిమా షూటింగ్ కార్యక్రమాలకు బాలకృష్ణ హాజరు అయ్యారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా ఇప్పటి వరకు సింహా, లెజెండ్, అఖండ సినిమాలు వచ్చి భారీ విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం వీరి కాంబోలో రూపొందుతున్న మూవీ అఖండ 2 అనే విషయం తెల్సిందే.
అఖండ సినిమా కథకు కొనసాగింపుగా ప్రస్తుతం అఖండ 2 రూపొందుతోంది. అందుకే అందులోని పాత్రలను ఈ సినిమాలో కొనసాగించబోతున్నారు. అఖండ సినిమాలో చిన్న పాప పాత్ర అత్యంత కీలకంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పాప పాత్రను మరింతగా అఖండ 2 లో చూపించేందుకు దర్శకుడు బోయపాటి ప్లాన్ చేస్తున్నారు. అఖండ 2 సినిమాలో ఆ పాప పాత్ర కోసం సీనియర్ హీరోయిన్ లయ కూతురు శ్లోకాను ఎంపిక చేశారని తెలుస్తోంది. గత కొంత కాలంగా శ్లోకా ను సినిమా ఇండస్ట్రీలో పరిచయం చేయాలని లయ భావిస్తోంది. అందుకు సరైన సమయం ఇదే అంటూ లయ నిర్ణయించుకుంది. అందుకే బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రూపొందుతున్న సినిమాలో నటింపజేసేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది.
బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రూపొందిన మూడు సినిమాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. నాల్గవ సినిమా అంతకు మించి ఉంటుంది అనే నమ్మకంను మేకర్స్‌తో పాటు బాలకృష్ణ అభిమానులు సైతం వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ సినిమాలో లయ కూతురు శ్లోకా నటించడం ద్వారా మరింతగా క్రేజ్ పెరిగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయంను వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో శ్లోకా ఫోటోలు వీడియోలు రెగ్యులర్‌గా వైరల్ అవుతాయి. ఆ మధ్య లయ తన కూతురును హీరోయిన్‌గా పరిచయం చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు సైతం వచ్చిన విషయం తెల్సిందే.
హీరోయిన్‌గా పరిచయం చేయడానికి ముందు ఇలా బాల నటిగా ఇండస్ట్రీలో పరిచయం చేయడం మంచి విషయం అంటూ కొందరు అంటున్నారు. మొత్తానికి అఖండ 2 సినిమాలో సీనియర్ హీరోయిన్ లయ కూతురు శ్లోకా నటించడం కన్ఫర్మ్ అయ్యింది. లయ తెలుగులో ఎన్నో సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించింది. ఇప్పుడు ఆమె కూతురు మొదటి సారి తెలుగు సినిమాలో కనిపించబోతుంది. అది కూడా బాలకృష్ణ వంటి పెద్ద స్టార్‌కి కూతురుగా నటించబోతున్న నేపథ్యంలో ఆమె ఎంట్రీ ఎప్పటికీ గుర్తుండిపోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అఖండ 2 మేకర్స్ నుంచి ఈ విషయం అధికారికంగా క్లారిటీ రావాల్సి ఉంది.