Begin typing your search above and press return to search.

LCU.. ఈ ఢిల్లీ గోలేంటి బాబోయ్

వాస్తవానికి లోకేశ్.. ఖైదీ 2ను ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఫ్రీక్వెల్ తీస్తానని అన్నారు. ఢిల్లీ(కార్తి) అసలు జైలుకు ఎందుకు వెళ్లాడు? జైలుకు వెళ్లబోయే ముందు అతడు ఏం చేసేవాడు?

By:  Tupaki Desk   |   21 Oct 2023 3:02 PM GMT
LCU.. ఈ ఢిల్లీ గోలేంటి బాబోయ్
X

లోకేష్ కనగరాజ్ దళపతి విజయ్ కాంబోలో తెరకెక్కిన లియో అక్టోబర్ 19న రిలీజై బిగ్గెస్ట్ ఓపెనింగ్ను అందుకుంది. డీసెంట్ రివ్యూస్, టాక్ రెస్పాన్స్ వస్తోంది. పాజిటివ్ లేదా నెగటివ్ అనేది కాసేపు పక్కనపెడితే.. అందరూ ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్(ఎల్సీయూ) ఫ్యాన్స్కు ఈ చిత్రం నచ్చినప్పటికీ.. ఎల్సీయూలోని ఇతర చిత్రాలతో పోలిస్తే ఇది కాస్త తక్కువేనని అంటున్నారు.

ఎల్సీయూని ఖైదీ, విక్రమ్ చిత్రాల కథలను చూస్తే.. వరుస ట్విస్ట్లు, సర్ ప్రైజ్లు, షాకింగ్లతో రసవత్తరంగా గ్రిప్పింగ్గా సాగుతుంటాయి. కానీ లియో విషయానికొస్తే.. మంచి స్టైలష్ గా యాక్షన్ ఎపిసోడ్స్, నటీనటుల పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ ఉన్నప్పటికీ కథ మాత్రం కాస్త సాగతీత ఎక్కువగా అనిపిస్తోంది. కథ బాగానే ఉన్నప్పటికీ.. ఖైదీ, విక్రమ్ తరహాలో అంత ఎత్తైటింగ్ గా సాగదు.

ఏదిఏమైనా ఈ లియో చిత్రంతో.. లోకేశ్ అఫీషియల్గా ఎల్సీయూలోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఇప్పుడు లియో తర్వాత ఆయన ఎల్ సీయూలోని నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ తీయట్లేదు. రజనీకాంత్తో తలైవార్ 171ను స్టాండ్ అలోన్గా చేస్తున్నారు. దీంతో ఫ్యాన్స్.. ఓ డిమాండ్ ను తెరపైకి తీసుకొచ్చారు. తామంతా చాలా కాలంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా ఖైదీ 2ను తెరపైకి తీసుకురావాలని గట్టిగా అడుగుతున్నారు. వీలైనంత త్వరగా ముందు ఆ సినిమానే చేయాలని పట్టుబడుతున్నారు. ఈ చిత్రాన్ని ముందుగా తీస్తే.. ఎల్సీయూ మరింత సక్సెస్ఫుల్గా, బలంగా ముందుకు నడుస్తుందని వారు ఆశపడుతున్నారు.

వాస్తవానికి లోకేశ్.. ఖైదీ 2ను ఎప్పుడో అనౌన్స్ చేశారు. ఫ్రీక్వెల్ తీస్తానని అన్నారు. ఢిల్లీ(కార్తి) అసలు జైలుకు ఎందుకు వెళ్లాడు? జైలుకు వెళ్లబోయే ముందు అతడు ఏం చేసేవాడు? అతడి గతం ఏంటి? వంటి విషయాలను చూపిస్తానని చెప్పారు. కానీ దాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారు. దీంతో ఫ్యాన్స్.. విక్రమ్ 2. రోలెక్స్ సినిమాల కన్నా ఢిల్లీ పాత్రనే ముందుగా కంప్లీట్ చేయాలని అడుగుతున్నారు.

రజనీ 171 పూర్తయ్యేసరికి మరో ఏడాది పడుతుంది. దీని తర్వాత ఖైదీ 2 తెరకెక్కించకపోతే మరింత ఆలస్యం అవుతుంది. ఫ్యాన్స్ ఏమో కమల్ హాసన్, విజయ్, సూర్య, కార్తీని ఒకే తెరపై చూడాలని అసపడతున్నారు. చూడాలి మరి లోకేష్ ఏం చేస్తారో..