Begin typing your search above and press return to search.

ఆషిఖి 3 లీకులపై చిత్ర‌బృందం లీగ‌ల్ నోటీసు

ఆషికీ 3 మేకర్స్ కార్తిక్ ఆర్యన్ సినిమా గురించి తప్పుడు సమాచార వ్యాప్తికివ్యతిరేకంగా నోటీసు జారీ చేసారు. కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో ఆషిఖి 3 చిత్రాన్ని గత సంవత్సరం ప్రకటించారు.

By:  Tupaki Desk   |   25 Sep 2023 4:31 PM GMT
ఆషిఖి 3 లీకులపై చిత్ర‌బృందం లీగ‌ల్ నోటీసు
X

ఆషికీ 3 మేకర్స్ కార్తిక్ ఆర్యన్ సినిమా గురించి తప్పుడు సమాచార వ్యాప్తికివ్యతిరేకంగా నోటీసు జారీ చేసారు. కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో ఆషిఖి 3 చిత్రాన్ని గత సంవత్సరం ప్రకటించారు.. తాజాగా ఈ సినిమాలోని ఓ పాట ఆన్‌లైన్‌లో లీక్ అయిన సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ఆషిఖి3 నుండి లీక్ అయిన పాట అని సోషల్ మీడియాలో లీకైంది. ఈ పరిణామం ఆన్ లైన్ లో చాలా సంచలనాలకు ఆజ్యం పోసింది. ప్రొడక్షన్ హౌస్ విశేష్ ఫిల్మ్స్ నుండి ఇంకా అధికారిక ప్రకటన లేదు. అయినా లీకులు మొద‌ల‌వ్వ‌డం ఆందోళ‌న క‌లిగించింది. అయితే ఆషికీ 3 మేకర్స్ ఇప్పుడు సినిమా గురించి వివ‌రాలు వెల్ల‌డించే అవ‌కాశం ఉంద‌ని తెలిసింది.


ఇటీవ‌ల లీకైన ఈ పాటను అరిజిత్ సింగ్ పాడినట్లు సమాచారం. ఆషిఖి 3 మేకర్స్ తమ సినిమా విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. ఇప్పుడు నోటీసును ఉల్లంఘించడం చట్టపరమైన పరిణామాలకు దారితీయవచ్చని ఆషిఖి 3 మేక‌ర్స్ హెచ్చరిస్తున్నారు. ఆషికీ ఫ్రాంచైజీ మూడో భాగం ఆషికీ 3 గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడంపై ప్రజలను హెచ్చరిస్తూ లీగల్ నోటీసును జారీ చేసినట్లు ఈరోజు ప్రారంభంలో విశేష్ ఫిల్మ్స్ సోషల్ మీడియా ల్లో వెల్ల‌డించింది. ఆషిఖి ఫ్రాంచైజీకి సంబంధించిన అన్ని మేధో సంపత్తి హక్కులు, నిర్మాణ‌ హక్కులకు తామే యజమాని అని మేకర్స్ తమ నోటీసులో పేర్కొన్నారు. ఇందులో తమ 1990 చిత్రం ఆషిఖి .. 2013 చిత్రం ఆషిఖి2 ఉన్నాయి. మా ప్రమేయం లేదా ఉనికి లేకుండా ఫ్రాంఛైజీలో ప్రీక్వెల్, సీక్వెల్ లేదా ఏదైనా నిర్మాణ ప‌నులు .. ఉత్పత్తి లేదా పంపిణీ, లేదా మార్కెటింగ్‌కు సంబంధించిన ఏవైనా కమ్యూనికేషన్‌లు, టై అప్ లు లేదా కట్టుబాట్లు అనధికారికమైనవి.. మోసపూరిత‌మైన‌వి అంటూ ఈ నోటీసులో పేర్కొన్నారు.

ఈ నోటీసు ఏదైనా ఉల్లంఘనలు లేదా అతిక్రమణలు (గతంలో, వర్తమానంలో లేదా భవిష్యత్తులో)కు పాల్ప‌డిన‌ట్ట‌యితే డిఫాల్టర్ ఖర్చు నష్టపరిహారాన్ని క్లెయిమ్ చేసే హ‌క్కు మేక‌ర్స్ కి ఉంది.. అని వెల్ల‌డించారు. ఆషిఖి 3 చిత్రాన్ని సెప్టెంబర్ 2022లో ప్రకటించారు. భూల్ జా పేరుతో లీక్ అయిన పాట మేకర్స్ ఇలా నోటీసు జారీ చేయడానికి దారితీసింది. అరిజిత్ సింగ్ ఈ పాడినట్లు పుకార్లు ఉన్నాయి. అరిజిత్ సింగ్ తన ఆషిఖి 2 పాటలతో ముఖ్యంగా తుమ్ హి హోతో గొప్ప పాపుల‌ర‌య్యాడు. ఆషిఖి ఫ్రాంచైజీలోని చివరి చిత్రం ఆషికీ 2 మే 2013లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. గత సంవత్సరం సెప్టెంబరు 8న ఆషిఖి 2 మేకర్స్ ఆషిఖి 3ని ప్రకటించి ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించారు. ఈ చిత్రంలో కార్తీక్ ఆర్యన్ కథానాయకుడిగా నటించబోతున్నారని కూడా తెలియజేశారు. హీరోయిన్ ఎవరనేది ఇంకా ప్రకటించాల్సి ఉంది.