Begin typing your search above and press return to search.

లెజెండ్ మ్యాన్లీ లుక్ దించేసాడే!

కానీ ఆ సినిమా మాత్రం ఆశించిన ఫ‌లితాన్ని వ్వ‌లేదు. దీంతో సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ కి గుర‌య్యాడు.

By:  Tupaki Desk   |   24 Jun 2024 10:30 AM GMT
లెజెండ్ మ్యాన్లీ లుక్ దించేసాడే!
X

బిజినెస్ మ్యాన్ శ‌ర‌వ‌ణ‌న్ ఆ రంగంలో ఎంత స‌క్సెస్ అయ్యాడో? క‌ళారంగంలోనూ అలా స‌క్సెస్ అవ్వాల‌ని 50 ఏళ్ల వ‌య‌సులో మ్యాక‌ప్ వేసుకున్న సంగ‌తి తెలిసిందే. రెండేళ్ల క్రితం `ది లెజెండ్` అనే సినిమా చేసాడు. ఆ సినిమాని ఏ రేంజ్ లో ప్ర‌మోట్ చేసారో తెలిసిందే. కోలీవుడ్ దిగ్గ‌జాల‌తో శ‌ర‌వ‌ణ‌న్ కోసం దిగొచ్చారంటే? బిజినెస్ మ్యాన్ గా అత‌డి రేంజ్ ఏంట‌న్న‌ది చెప్పొచ్చు.


కానీ ఆ సినిమా మాత్రం ఆశించిన ఫ‌లితాన్ని వ్వ‌లేదు. దీంతో సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ కి గుర‌య్యాడు. అత‌డి లుక్ పై ర‌క‌ర‌కాల ట్రోలింగ్ లు తెర‌పైకి వ‌చ్చాయి. కానీ శ‌ర‌వ‌ణ‌న్ వేటిని ప‌ట్టించుకోలేదు. త‌న టార్గెట్ వైపు ప్ర‌యాణం కొన‌సాగించారు. తాజాగా కొత్త సినిమాను ప్రకటించారు. దాదాపు రెండేళ్ల తర్వాత మ‌ళ్లీ మ్యాక‌ప్ వేసుకున్నారు. `గరుడన్‌` అనే ప‌వ‌ర్ పుల్ టైటిల్ తో దురై సెంథిల్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ సినిమా చేస్తున్నారు.

పూజా కార్యక్రమాలతో నేడు ఈ సినిమా షూటింగ్ మొదలైంది. ఈ సంద‌ర్భంగా శ‌ర‌వ‌ణ‌న్ న్యూలుక్ ని లాంచ్ చేసారు. ఇందులో లుక్ పూర్తిగా డిఫ‌రెంట్ గా ఉంది. ఒక్క‌సారిగా ఆలుక్ లో చూసి అత‌డి ట్రాన్స‌ప‌ర్మేష‌న్ చూసి స‌ర్ ప్రైజ్ అయ్యారంతా. ప‌క్కా మ్యాన్లీ లుక్ లో క‌నిపించారు. న్యూ హెయిర్ స్టైల్, గ‌డ్డంతో సంథింగ్ డిఫ‌రెంట్ లుక్ ట్రై చేసాడు. బాడీలాంగ్వేజ్ లో నూ మార్పులు తీసుకొచ్చారు.

తొలి సినిమాలో మీసం, గ‌డ్డం లేకుండా కనిపించినా తాజా లుక్ లో పూర్తి భిన్నంగా ఉన్నాడు. రెండేళ్లు గ్యాప్ తీసుకుని మ‌రీ కొత్త‌గా ట్రై చేయ‌డం అత‌డి ప‌ట్టుద‌ల‌కు నిద‌ర్శ‌నంగా చెప్పొచ్చు. వ‌చ్చిన విమ‌ర్శ‌ల న్నింటినీ ఈ సినిమాతో తుడిచిపెట్టేస్తాడేమో చూడాలి. ప్ర‌స్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. ఇక‌పై రిలీజ్ వ‌ర‌కూ శ‌ర‌వ‌ణ‌న్ మీడియాలో హాట్ టాపిక్ అవుతాడు.