Begin typing your search above and press return to search.

అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్లా?

ఇళయ దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రిలీజ్ కి సిద్ధం అవుతోన్న పాన్ ఇండియా మూవీ లియో

By:  Tupaki Desk   |   17 Oct 2023 4:11 AM GMT
అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 100 కోట్లా?
X

ఇళయ దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రిలీజ్ కి సిద్ధం అవుతోన్న పాన్ ఇండియా మూవీ లియో. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ యాక్షన్ ప్యాక్డ్ కథాంశంతో ఉండబోతోందని ట్రైలర్ తోనే కన్ఫర్మ్ అయిపొయింది. త్రిష ఈ చిత్రంలో విజయ్ కి జోడీగా నటిస్తోంది. విజయ్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సుమారు 300 కోట్ల వరకు చిత్రానికి ఖర్చు పెట్టారు. అయితే డిజిటల్, శాటిలైట్, ఆడియో రైట్స్ ద్వారా ఈ చిత్రానికి 226 కోట్ల వరకు వచ్చేసాయి. థీయాట్రికల్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది. భారీ అంచనాల మధ్య థియేటర్స్ లోకి రాబోయే లియో కోసం ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ లో లియో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయని చెప్పొచ్చు.

ఇప్పటి వరకు 60 కోట్ల వరకు ఓవర్సీస్ మార్కెట్ లో లియో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది నిజంగా సంచలనం అని చెప్పాలి. ఇప్పటి వరకు ఏ హీరోకి కూడా కోలీవుడ్ నుంచి ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగలేదు. హైయెస్ట్ ఓవర్సీస్ మార్కెట్ ఉన్న హీరోగా విజయ్ మరోసారి దీంతో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఇండియాలో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటి వరకు 50 కోట్లు మాత్రమె కలెక్ట్ చేయగలిగింది అంట.

తమిళనాడులో అడ్వాన్స్ బుకింగ్స్ ఎక్కువగా ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేసిన అనుకున్న స్థాయిలో ఇంకా జరగడం లేదని టాక్. అయితే ఈ రోజు పెద్ద ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ తెలంగాణాలో జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకు అయితే ఈ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా లియో కి 110 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చేసాయి.

ఈ రోజు లెక్కలు మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కచ్చితంగా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్స్ 150 కోట్ల మార్క్ ని టచ్ చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. అదే జరిగితే కోలీవుడ్ హిస్టరీలోనే హైయెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ సొంతం చేసుకున్న స్టార్ గా దళపతి విజయ్ నిలిచిపోతాడు. అభిమానులు కూడా అదే కోరుకుంటున్నారు.