Begin typing your search above and press return to search.

లియో కోసం కోర్టుకెళ్లారు.. ఏమవుతుందో..

ఇదిలా ఉంటే కోలీవుడ్ లో దళపతి విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమాని ఫస్ట్ డే బెన్ ఫిట్ షోనే చూడాలని ఆశపడుతూ ఉంటారు. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినపుడు ఈ బెన్ ఫిట్ షోలు సర్వసాధారణంగా ఉంటాయి.

By:  Tupaki Desk   |   16 Oct 2023 2:10 PM GMT
లియో కోసం కోర్టుకెళ్లారు.. ఏమవుతుందో..
X

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి రాబోతున్న సినిమా లియో. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై దేశ వ్యాప్తంగా భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది. కోలీవుడ్ హిస్టరీలోనే హైయెస్ట్ బిజినెస్ ఈ చిత్రంపై జరిగింది. అలాగే మూవీ కూడా హైయెస్ట్ కలెక్షన్స్ సాదిస్తుందని అంచనా వేస్తున్నారు.

సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కోలీవుడ్ లో దళపతి విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమాని ఫస్ట్ డే బెన్ ఫిట్ షోనే చూడాలని ఆశపడుతూ ఉంటారు. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినపుడు ఈ బెన్ ఫిట్ షోలు సర్వసాధారణంగా ఉంటాయి. ఉదయం నాలుగు గంటలకి షో పడుతుంది. అలాగే మొదటి వారం ఎక్స్ ట్రా షోలకి కూడా పర్మిషన్ ఇస్తారు.

అయితే లియో సినిమా విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఎక్స్ ట్రా షోతో కలిపి ఐదు షోలు వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. కాని బెన్ ఫిట్ షోకి మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో ఉదయం 9 గంటలకి మాత్రమే తమిళనాడులో లియో మొదటి షో పడనుంది. అయితే ప్రభుత్వం నిర్ణయంపై నిర్మాత లలిత్ కుమార్, జగదీశ్ పళనిస్వామి కోర్టుని ఆశ్రయించారు.

అభిమానుల కోసం వేసే మార్నింగ్ బెన్ ఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ పై కోర్టు మంగళవారం ఉదయం విచారించనుంది. స్పెషల్ షోలకి పర్మిషన్ ఇవ్వాలని లియో నిర్మాతల రిక్వెస్ట్ ని కోర్టు ఎంత వరకు పరిగణంలోకి తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

అయితే ఎక్స్ ట్రా షోలకి పర్మిషన్ ఇచ్చిన తమిళనాడు ప్రభుత్వం ఉదయం 4 గంటలకి ప్రదర్శించే స్పెషల్ బెన్ ఫిట్ షోలకి పర్మిషన్ ఇవ్వకపోవడంపై దళపతి ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఈ మధ్యకాలంలో విజయ్ రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు అనే ప్రచారం తమిళనాట జరుగుతోంది.

ఈనేపథ్యంలోనే విజయ్ సినిమాలని స్టాలిన్ ప్రభుత్వం ఏవేవో సాకులు చూపించి నియంత్రించే ప్రయత్నం చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరి ఈ వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్లడంతో రేపు ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. పర్మిషన్ ఇస్తే మాత్రం స్టాలిన్ సర్కార్ పై విజయ్ పైచేయి సాధించినట్లు అవుతుంది.