Begin typing your search above and press return to search.

3 వారాలు అనుకుంటే 5 వారాలు పట్టింది

తమిళ్ సూపర్ స్టార్‌ విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ మూవీ లియో సినిమా అక్టోబర్‌ 19న దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.

By:  Tupaki Desk   |   20 Nov 2023 6:04 AM GMT
3 వారాలు అనుకుంటే 5 వారాలు పట్టింది
X

తమిళ్ సూపర్ స్టార్‌ విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన క్రేజీ మూవీ లియో సినిమా అక్టోబర్‌ 19న దసరా సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. తమిళేతర భాషల్లో ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా భావించినా కూడా నిరాశే మిగిలింది.

లోకేష్ కనగరాజ్ సినిమా అయినా కూడా తమిళనాడు బయట పెద్దగా ప్రభావం చూపించడం లో విఫలం అయింది. అయినా కూడా సొంత భాష లో ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టించిందని బాక్సాఫీస్ వర్గాల టాక్. అయితే రికార్డుల మోత మ్రోగిస్తుందని భావిస్తే నిరాశే మిగిలింది. వెయ్యి కోట్ల సినిమా అనుకుంటే అంత లేదని తేలిపోయింది.

సినిమాకు ఎలాగూ యావరేజ్ టాక్‌ వచ్చింది కనుక సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌ చేయడానికి నాలుగు అయిదు వారాలు ఆగాల్సిన అవసరం ఏముంది.. మూడు వారాలు పూర్తి అయిన వెంటనే ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతున్నారు అని చాలా మంది సోషల్ మీడియా ద్వారా లియో సినిమా గురించి ఇష్టానుసారంగా మాట్లాడుకుంటూ వచ్చారు

అదుగో లియో స్ట్రీమింగ్‌, ఇదుగో లియో స్ట్రీమింగ్‌ అంటూ సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంకు ఫుల్‌ స్టాప్ పడబోతుంది. మూడు వారాల్లోనే స్ట్రీమింగ్‌ అవ్వనుందని అనుకుంటూ ఉంటే ఏకంగా అయిదు వారాలకు ఓటీటీ స్ట్రీమింగ్ కి లియో రెడీ అయింది. నవంబర్‌ 24న ఈ సినిమా ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు.

తమిళ్ తో పాటు ఇతర అన్ని భాషల్లో కూడా ఇండియాలో నవంబర్‌ 24న స్ట్రీమింగ్‌ అవ్వబోతుంది. ఇక ప్రపంచ దేశాల్లో మాత్రం నవంబర్‌ 28 నుంచి స్ట్రీమింగ్‌ అవ్వనుందట. ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ వారు ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. తమిళేతర ప్రేక్షకులు థియేట్రికల్‌ స్క్రీనింగ్ మిస్‌ అవ్వడంతో ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌ కి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది.