Begin typing your search above and press return to search.

విజయ్ లియోకి షాక్.. సినిమా ప్రదర్శించలేమని థియేటర్ల ముందు బోర్డ్..!

కనీసం 8 వారాలు గడువు లేని సినిమాలు తమ స్క్రీన్స్ పై ప్రదర్శించకుండా మల్టీప్లెక్స్ ఓనర్స్ నిర్ణయం తీసుకున్నారు. దాని వల్ల లియోకి చాలా దెబ్బ పడేలా ఉంది.

By:  Tupaki Desk   |   19 Oct 2023 11:56 AM GMT
విజయ్ లియోకి షాక్.. సినిమా ప్రదర్శించలేమని థియేటర్ల ముందు బోర్డ్..!
X

దళపతి విజయ్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో వచ్చిన లియో సినిమా విషయంలో ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. స్టార్ సినిమాకు రిలీజ్ రోజు అర్ధరాత్రి నుంచి షోస్ వేస్తారు. కానీ తమిళనాడులో బెనిఫిట్ షోస్ కి పర్మిషన్ ఇవ్వలేదు. అంతేకాదు ఉదయం 7 గంటలకు కూడా షోలు పర్మిషన్ ఇవ్వలేదు. తమిళనాడులో తప్ప చాలా చోట్ల ఎర్లీ మార్నింగ్ షోస్ పడ్డాయి. చెన్నైలో లియో ఉదయం 9 గంటలకు మొదటి షో పడింది.

ఇదిలా ఉంటే కొన్ని థియేటర్లు ఏకంగా విజయ్ లియోని ప్రదర్శించలేమని బోర్డులు కూడా పెట్టారు. తమిళ నాట కొన్ని థియేటర్ల ఒనర్లు లియోని ప్రదర్శించకూడదని ఫిక్స్ అయ్యారు. దీనికి అసలు కారణం ఏంటని చూస్తే లియోకు థియేటర్ల నుంచి వచ్చే రెవెన్యూలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల వాటా ఎక్కువ అడగడమే అని తెలుస్తుంది.

టికెట్ల అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయంలో 80 నుంచి 85 శాతం వరకు ఇవ్వాలని లియో డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ చేశారట. కానీ థియేటర్ల యాజమాన్యాలు మాత్రం 70 శాతానికి మించి ఇవ్వలేమని చెప్పారట. కొన్ని చోట్ల డీల్స్ జరిగినా కొన్ని థియేటర్ల ఓనర్లు మాత్రం డిస్ట్రిబ్యూటర్లు కోరిన మొత్తం ఇవ్వలేమని థియేటర్లలో లియోని ప్రదర్శించలేమని బోర్డులు పెట్టారు.

చెన్నైలోని ఫేమస్ అయిన రోహిణి తో పాటుగా కొన్ని పాపులర్ థియేటర్లలో లియో ప్రదర్శించలేదని తెలుస్తుంది. ఇదే కాదు లియో సినిమాను నార్త్ సైడ్ పీ.వి.ఆర్ తో పాటుగా కొన్ని మల్టీప్లెక్స్ లు కూడా ప్రదర్శించడం లేదు. నెల రోజులకే లియో ఓటీటీ రిలీజ్ డీల్ కుదిరింది. కనీసం 8 వారాలు గడువు లేని సినిమాలు తమ స్క్రీన్స్ పై ప్రదర్శించకుండా మల్టీప్లెక్స్ ఓనర్స్ నిర్ణయం తీసుకున్నారు. దాని వల్ల లియోకి చాలా దెబ్బ పడేలా ఉంది.

ఇక రిలీజైన విజయ్ లియో టాక్ సంగతి చూస్తే లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ హడావిడి చేసి రొటీన్ కథతో లియో తెరకెక్కించాడు లోకేష్. విజయ్ ఫ్యాన్స్ కి బాగానే ఎక్కుతుంది కానీ సాధారణ ఆడియన్స్ కు ఇది అంతగా మెప్పించలేదని చెప్పొచ్చు. అయితే ఫైనల్ రిజల్ట్ ఏంటన్నది వీకెండ్ వరకు ఆగితే తెలుస్తుంది. అనిరుద్ మ్యూజిక్ మాత్రం ఇంప్రెసివ్ గా అనిపించింది. అయితే లియో మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉండటం వల్ల కూడా ఈ టాక్ కి కారణం కావొచ్చని చెప్పొచ్చు.