లియో - LCU.. ఆడియెన్స్ - ICU
ఇకపోతే ఈ చిత్రం మొదటి నుంచి ఎల్సీయూలో భాగమా కాదా అన్న సస్పెన్స్‌ను మెయిన్ చేసింది మీవీటీమ్.
By: Tupaki Desk | 19 Oct 2023 5:42 AM GMTదసరా బాక్సాఫీస్ జాతర మొదలైంది. బాలయ్య భగవంత్ కేసరి, శివ రాజ్‌కుమార్ ఘోస్ట్ పాజిటివ్ టాక్ తెచ్చుకోగా.. మోస్ట్ హైప్డ్ లోకేశ్ కనగరాజ్ - దళపతి విజయ్ లియో మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అభిమానులంతా థియేటర్ల వద్ద భారీగా చేరి ఈలలు, గోలలలో సందడి చేస్తున్నారు. అయితే వీటిలో లియో ట్రోలింగ్ కూడా కాస్త ఎక్కువైంది. మొదట డీసెంట్ టాక్‌తోనే ట్రెండింగ్ ప్రారంభించికున్న ఈ సినిమా... ఆ తర్వాత స్లోగా నెగటివ్ టాక్‌తో ట్రెండ్ అవ్వడం ప్రారంభమైంది.
ఫస్టాఫ్ బాగుందని.. కానీ సెకండాఫ్ కాస్త డౌన్ అయిందని ఎక్కువ మంది రివ్యూలు పెడుతున్నారు. అయితే ఇదే క్రమంలోనే కొంతమంది ఫస్టాఫ్ ఎంట్రీ సీన్స్ మీద కూడా ట్రోల్స్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమా ప్రమోషన్స్‌లో లోకేశ్ కనగరాజ్ మాట్లాడుతూ.. లియో సినిమా మొదటి పది నిమిషాలు అస్సలు మిస్ కాకండి. ఆ 10 నిమిషాలు ఎంతో స్పెషల్‌గా ఉంటుంది. దాని కోసం ఎంతో హార్డ్ వర్క్ చేసినట్లు చెప్పారు. దీంతో ఆ పది నిమిషాల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.
అయితే ఇప్పుడది హైనా ఎపిసోడ్ అని క్లారిటీ వచ్చేసింది. ఇందులో విజయ్.. దానితో పోరాడుతున్నట్లుగా చూపించారు. ఇది చూసిన సినీ ప్రియులు.. సింహం-చీతాతో పారాడేలా బిల్డప్ ఇచ్చారు. కానీ అది హైనా. ఈ సీన్ ఎంతో కామెడీ జోక్‌లా ఉందంటూ నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.
ఇకపోతే ఈ చిత్రం మొదటి నుంచి ఎల్సీయూలో భాగమా కాదా అన్న సస్పెన్స్‌ను మెయిన్ చేసింది మీవీటీమ్. తాజాగా రిలీజ్‌తో అది ఎల్సీయూలో భాగమేనని క్లారిటీ అయిపోయింది. అయితే నెగటివ్ రివ్యూ ట్రోలర్స్.. 'లియో సినిమా ఎల్సీయూ... ఆడియెన్స్ ఐసీయూ' అంటూ రైమింగ్‌తో తెగ కామెంట్లు చేస్తున్నారు.
కాగా, లియోలో దళపతి విజయ్, సంజయ్ దత్, అర్జున్ సర్జా యాక్టింగ్‌తో పాటు అనిరుధ్ మ్యూజిక్ బాగుందన్న పాజిటివ్ రివ్యూస్ కూడా వస్తున్నాయి. మరి రేపు(అక్టోబర్ 20) రిలీజ్ కానున్న టైగర్ నాగేశ్వరరావు, టైగర్ ష్రాఫ్ గణపత్ ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటాయో..