Begin typing your search above and press return to search.

లియో బజ్ పోగొట్టేలా.. కామెడీ చేస్తున్నారే..

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లియో మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది

By:  Tupaki Desk   |   22 Sep 2023 4:08 AM GMT
లియో బజ్ పోగొట్టేలా.. కామెడీ చేస్తున్నారే..
X

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లియో మూవీ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకి రానుంది. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధమవుతోన్న ఈ మూవీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా ఉండబోతోందనే సంగతి అందరికి తెలిసిందే. సంజయ్ దత్ లియో చిత్రంలో మెయిన్ విలన్ గా నటించారు. ఇది అతనికి ఫస్ట్ తమిళ్ మూవీ.

లియో చిత్రంలో విజయ్, సంజయ్ దత్ మధ్య వచ్చే యాక్షన్ సీక్వెన్స్ మూవీకి హైలైట్ గా ఉంటాయనే ప్రచారం కోలీవుడ్ సర్కిల్ లో నడుస్తోంది. ఆంటోనీ దాస్ అనే పాత్రలో సంజయ్ దత్ చిత్రంలో కనిపించబోతున్నారు. తాజాగా చిత్ర యూనిట్ ఒక ఈ యాక్షన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. ఇందులో విజయ్ సంజయ్ దత్ కంఠం పట్టుకొని సీరియస్ గా చూస్తున్న లుక్ ఉంది. ఇప్పటికే లియో మూవీ నుంచి చాలా పోస్టర్ స్టిల్స్ వచ్చాయి. అవి ఏదో ఒక సినిమాతో పోలిక ఉండటం విశేషం.

తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ కూడా విజయ్ పాత సినిమాలోని ఒక స్టైల్ ని పోలి ఉంది. దీంతో రెండింటిని ఎటాచ్ చేస్తూ విజయ్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ పోస్టర్ ట్రెండ్ అవుతోంది. దీనిపై విజయ్ అభిమానులు కౌంటర్ ఇస్తూ ఉంటే, యాంటీ ఫ్యాన్స్ మాత్రం విజయ్ యాక్టింగ్ స్టైల్ అప్పటికి, ఇప్పటికి ఒకేలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి లియో మూవీపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే రెగ్యులర్ గా రిలీజ్ చేస్తున్న పోస్టర్స్ మాత్రం సినిమాకి అంతగా బజ్ తీసుకురావడం లేదు. ఈ పోస్టర్స్ లో ఏదో ఒక సినిమా స్టిల్స్ కి పోలిక ఉండటమే దీనికి కారణం దీంతో పోస్టర్స్ కారణంగా లియో మూవీపై సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ట్రోలింగ్ జరుగుతోంది. ఈ ట్రోలింగ్ సినిమాపై ఉన్న బజ్ మొత్తం పోగొట్టేలా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నిజానికి విజయ్ మార్కెట్ రేంజ్ ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది. కోలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాల జాబితాలో ప్రతి ఏడాది విజయ్ మూవీ కచ్చితంగా ఉంటుంది. ఈ ఏడాది వచ్చిన వారిసు మూవీ కూడా 300 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించింది. లియో మూవీపైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి. కానీ పోస్టర్ స్టిల్స్ మాత్రం సినిమాపై నెగిటివిటీ పెరగడానికి కారణం అవుతున్నాయనే మాట వినిపిస్తోంది.