Begin typing your search above and press return to search.

సంపాద‌న అంతా జ‌ల్సాల‌కు త‌గ‌లేసిన స్టార్ హీరో

పాపుల‌ర్ స్టార్ హీరో త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బును తృణ‌ప్రాయంగా ఖ‌ర్చు చేసిన విధానం అభిమానుల‌ను ఎల్ల‌పుడూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది

By:  Tupaki Desk   |   29 Jun 2024 3:00 AM GMT
సంపాద‌న అంతా జ‌ల్సాల‌కు త‌గ‌లేసిన స్టార్ హీరో
X

పాపుల‌ర్ స్టార్ హీరో త‌న వ‌ద్ద ఉన్న డ‌బ్బును తృణ‌ప్రాయంగా ఖ‌ర్చు చేసిన విధానం అభిమానుల‌ను ఎల్ల‌పుడూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. అద‌ర‌క బెద‌ర‌క ఖ‌ర్చు చేయ‌డంలో చాలా మంది స్టార్ల వ్య‌వ‌హార శైలితో పోలిస్తే అత‌డి శైలి భిన్న‌మైన‌ది. అత‌డు త‌న సంప‌ద‌లో చాలా భాగం ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త‌ను కాపాడేందుకు ఖ‌ర్చు చేశాడంటే ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క మాన‌దు. గ్లోబ‌ల్ వార్మింగ్ వ‌ల్ల మాన‌వాళి అంత‌మ‌వ్వ‌డం ఖాయ‌మ‌ని శాస్త్ర‌వేత్త‌లు ఆందోళ‌న చెందుతున్న వేళ ఎవ‌రూ దీనిని బాధ్య‌త‌గా స్వీక‌రించి ఆవ‌ర‌ణాల‌ను కాపాడ‌టానికి సాయ‌ప‌డాల‌ని అనుకోవ‌డం లేదు. కానీ ఆ హీరో మాత్రం ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ కోసం మిలియ‌న్ల డాల‌ర్ల సొమ్మును వెచ్చించాడు. ఈ వ్య‌వ‌హారం ఇలా ఉంటే, అత‌డు విలాసాలు జ‌ల్సాల కోసం ఖ‌ర్చు చేసిన మొత్తం చాలా పెద్ద‌ది. ఇంత‌కీ ఎవ‌రా హీరో? అంటే.. ది గ్రేట్ టైటానిక్ హీరో లియానార్డో డికాప్రియో.

`అమెజాన్ ఫారెస్ట్ ఫండ్` పేరుతో అత‌డు ప‌ర్యావ‌ర‌ణాన్ని కాపాడేందుకు నిధిని స‌మ‌కూర్చాడు. 25 ఆగస్ట్ 2019న డికాప్రియో ఎర్త్ అలయన్స్ పేరుతో ప‌ర్యారణ ప‌రిర‌క్ష‌ణ కోసం చొరవ చూపుతూ త‌న నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. మంట‌ల్లో అమెజాన్ అడ‌వులు త‌గ‌ల‌బ‌డిపోతుంటే దాని ప‌ర్య‌వ‌సానంపై డికాప్రియో తీవ్రంగా క‌ల‌త చెందారు. ఈ ప్ర‌మాదాల్ని ఆప‌డానికి త‌న‌వంతుగా సహాయాన్ని అందించడానికి తమ అమెజాన్ ఫారెస్ట్ ఫండ్ ద్వారా 5 మిలియ‌న్ల అమెరిక‌న్ డాల‌ర్లు వెచ్చిస్తున్నట్లు ప్రకటించారు. ప్ర‌పంచంలో ఏ స్టార్ హీరో తీసుకోని డ్యాషింగ్ డెషిస‌న్ డికాప్రియో తీసుకున్నాడు.

డికాప్రియో సినిమాల్లో సంపాదించిన డ‌బ్బును నచ్చిన విధంగా జ‌ల్సా చేస్తాడ‌ని కూడా టాక్ ఉంది. ఫిస్కర్ ఆటోమోటివ్ వారు దివాళా తీయడానికి ముందు లియోనార్డో డికాప్రియో ఆ కంపెనీకి పెద్ద అభిమాని, అతడు దాని బ్రాండ్ అంబాసిడర్‌గా కంపెనీలో పెట్టుబడి పెట్టాడు. అతడు ఫార్ములా E రేసులలో మునిగితేల్తుంటాడు. టయోటా ప్రియస్, టెస్లా రోడ్‌స్టర్‌లను నడపడంలో కూడా డికాప్రియో ప్రసిద్ధి చెందాడు. తన మొదటి కారు 1969 ఫోర్డ్ ముస్టాంగ్ అని లియోనార్డో గ‌తంలో వెల్లడించాడు. ఆ కార్ ని రిపేర్లు చేయించ‌డానికి చాలా పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేస్తుంటాడు ఇప్ప‌టికీ. డికాప్రియో ఒక స్టార్‌గానే కాదు.. సినిమాకు పెద్ద అభిమానిగా అత‌డు చేసే ప‌నులు ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయి. డికాప్రియో చలనచిత్ర ప‌రిశ్ర‌మ‌ చరిత్రలోని పురాత‌న వ‌స్తువుల‌ను అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ & సైన్సెస్ మ్యూజియమ్‌కు తిరిగి తీసుకురావడానికి `ది విజార్డ్ ఆఫ్ ఓజ్` నుండి ఐకానిక్ సీక్విన్డ్ షూలను కొనుగోలు చేయడంలో సహాయం చేశాడు.

2010లో దేశంలో సంభవించిన భూకంపం నేపథ్యంలో హైతీ కోసం డబ్బును సేకరించేందుకు ఒక ఛారిటీ వేలంలో డికాప్రియో బోనో గిటార్ కోసం ల‌క్ష‌ US డాల‌ర్లు వెచ్చించాడు. అత‌డు తన ప్రత్యేకమైన పెంపుడు పెట్స్ తో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఇష్టపడతాడు.. సుల్కాటా తాబేళ్ల‌ను అత‌డు పోషిస్తున్నాడు. ఈ జ‌ల‌చ‌ర జీవ‌రాశులు 80 సంవత్సరాల వరకు జీవించగలవు. వీటి పెంప‌కానికి పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేస్తున్నాడు.

డికాప్రియో తన రియల్ ఎస్టేట్ పోర్ట్‌ఫోలియోను రసవత్తరంగా మార్చడం ద్వారా ఒక తెలివైన వ్యాపార ప్ర‌క్రియ‌ను ప్రారంభించాడు. నాలుగు నెలల్లో మూడు ఆస్తులపై దాదాపు 23 మిలియన్ల అమెరిక‌న్ డాల‌ర్లు ఖర్చు చేసినట్లు క‌థ‌నాలొచ్చాయి. కాలిఫోర్నియాలోని పామ్ స్ప్రింగ్స్‌లోని దీనా షోర్ అత‌డి పూర్వ నివాసం. ఒక పూల్, స్పా, టెన్నిస్ కోర్ట్, ఆరు బెడ్‌రూమ్‌లు, ఎనిమిది బాత్‌రూమ్‌లు, విశాలమైన గెస్ట్ హౌస్‌తో కూడిన ఫ్లాట్ మోడ్రన్ ఒయాసిస్ న త‌ల‌పిస్తుంది. దీనికోసం సుమారు 5.23 మిలియన్ డాల‌ర్లు పెట్టుబ‌డిగా ప‌ట్టాడు.

న్యూయార్క్‌లోని గ్రీన్‌విచ్ విలేజ్‌లోని డెలోస్ బిల్డింగ్‌లో 10 మిలియన్ డాల‌ర్ల విలువైన‌ అపార్ట్‌మెంట్‌ను కూడా కొనుగోలు చేశాడు. ఈ అపార్ట్ మెంట్ లో ఇన్-డక్ట్ అరోమాథెరపీ, సైబీరియన్ ఓక్ ఫ్లోర్‌ల వంటి అత్యాధునిక ఆరోగ్య సాంకేతికతలను యూనిట్ ల‌ను ఏర్పాటు చేసాడు. గ‌దిలో వ్య‌క్తుల‌ భంగిమను సున్నితంగా సపోర్ట్ చేయడానికి నిర్మించిన ప్ర‌త్యేక సాంకేతిక ఫ‌ర్నిచ‌ర్ ఈ ఇంటిలో అందుబాటులో ఉంచ‌డానికి పెద్ద మొత్తం ఖ‌ర్చు చేసాడు.

ఇలా విలాసాలు జ‌ల్సాల కోసం అత‌డు చాలా పెద్ద మొత్తంలోనే ఖ‌ర్చు చేస్తుంటాడు. వీటిలో కొన్ని పెట్టుబ‌డులు మాత్రం అపారంగా ఎదిగాయి. టైటానిక్, ది రివ‌నెంట్, ఇన్ సెప్ష‌న్ స‌హా ప‌లు బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల్లో డికాప్రియో న‌టించిన సంగ‌తి తెలిసిందే.