Begin typing your search above and press return to search.

లియో మూవీ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత!

ఇక లియో మూవీ కచ్చితంగా 500 కోట్లకి పైగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

By:  Tupaki Desk   |   22 Sep 2023 3:58 AM GMT
లియో మూవీ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత!
X

ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ లియో. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ చిత్రం సిద్ధమవుతోంది. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపిస్తున్నారు. త్రిష, ప్రియా ఆనంద్ ఫీమేల్ లీడ్ రోల్స్ లో నటించారు. దసరా కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి రానుంది.

ఇప్పటికే సినిమాపై భారీగా బిజినెస్ జరిగింది. విజయ్ కెరియర్ లోనే హైయెస్ట్ బిజినెస్ డీల్స్ జరిగిన చిత్రంగా లియో మూవీ నిలిచింది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ ద్వారా సినిమాకి పెట్టిన పెట్టుబడిలో మెజారిటీ షేర్ వచ్చేసింది. ఏకంగా 205 కోట్లు నాన్ థీయాత్రికల్ రైట్స్ ద్వారా లియో సొంతం చేసుకుంది. థీయాత్రికల్ బిజినెస్ కూడా గట్టిగానే జరిగింది. తెలుగు రాష్ట్రాలలో ఎన్నడూ లేని విధంగా 20 కోట్లకి పైగా లియో రిలీజ్ రైట్స్ ధర పలకడం విశేషం.

ఈ మధ్యకాలంలో విజయ్ నుంచి మేగ్జిమమ్ సూపర్ హిట్ సినిమాలే వస్తున్నాయి. ప్రతి సినిమా కూడా 300 కోట్లు సునాయాసంగా దాటేస్తోంది. ఇక లియో మూవీ కచ్చితంగా 500 కోట్లకి పైగా కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం కోలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని అందుకునే అవకాశం ఉంటుందని ట్రేడ్ పండితుల అంచనా.

భారీ ఎక్స్ పెక్టేషన్స్ మధ్య రిలీజ్ అవుతోన్న ఈ మూవీ డిజిటల్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే డిజిటల్ రిలీజ్ కి సంబందించిన డీల్ గురించి ఇంటరెస్టింగ్ న్యూస్ ఇప్పుడు బయటకొచ్చింది. మూవీ రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేసేలా ఒప్పందం చేసుకున్నారంట. అంటే దీపావళి పండగ నాటికి ఓటీటీలో లియో మూవీ రిలీజ్ అయిపోయే అవకాశం ఉంటుంది.

నాలుగు వారాల సమయం అంటే మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన మేగ్జిమమ్ కలెక్షన్స్ నాలుగు వారాల్లో వచ్చేస్తాయి. తరువాత ఓటీటీ రిలీజ్ చేసుకున్న డిస్టిబ్యూటర్స్ కి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అందుకే ఈ ఒప్పందం ప్రకారం డిజిటల్ హక్కులని నిర్మాతలు నెట్ నెట్ ఫ్లిక్స్ కి ఇచ్చినట్లు తెలుస్తోంది.