Begin typing your search above and press return to search.

లియో సాంగ్: అనిరుధ్ మార్క్ 'బ్యాడాస్' గ్లింప్స్

లియో పాట బ్యాడ్ యాస్ అనిరుధ్ మార్క్ పెప్పీ నంబ‌ర్. లియో నుంచి తాజాగా విడుదలైన బ్యాడాస్ గ్లింప్స్ వీడియో స్పష్టంగా ఇంటర్నెట్ లో జోరుగా వైర‌ల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   28 Sep 2023 5:09 AM GMT
లియో సాంగ్: అనిరుధ్ మార్క్ బ్యాడాస్ గ్లింప్స్
X

తమిళ చిత్ర పరిశ్రమలోని అసాధార‌ణ స్టార్ డ‌మ్ ని ఆస్వాధిస్తున్న మేటి హీరో ద‌ళ‌పతి విజయ్. విక్ర‌మ్ ఫేం లోకేష్ కనగరాజ్‌తో క‌లిసి `లియో` కోసం ప‌ని చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అవుట్ అండ్ అవుట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ సంవత్సరం అక్టోబర్‌లో గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది.

కొన్ని వ‌రుస విజ‌యాల త‌ర్వాత ద‌ళ‌పతి విజయ్ .. ప్రఖ్యాత సంగీత స్వరకర్త అనిరుధ్ రవిచందర్‌ల పునఃకలయిక ఆస‌క్తిని పెంచుతోంది. ఇది క్రేజీ కాంబో. మొదటి సింగిల్ నాన్ రెడీ.. సంగీత ప్రియుల మ‌న‌సులు దోచింది.

ఇప్పుడు రెండవ సింగిల్ బాడ్ యాస్‌.. ను విడుదల చేయనున్నారు. ఆసక్తికరంగా ఈరోజు (సెప్టెంబర్ 28, గురువారం) ఉదయం 12 గంటలకు సోషల్ మీడియాలో చెప్పకుండానే బ్యాడాస్ గ్లింప్స్ వీడియోను విడుదల చేయడం ద్వారా లియో టీమ్ తమిళ సినీ అభిమానులను ఆశ్చర్యపరిచింది.

లియో పాట బ్యాడ్ యాస్ అనిరుధ్ మార్క్ పెప్పీ నంబ‌ర్. లియో నుంచి తాజాగా విడుదలైన బ్యాడాస్ గ్లింప్స్ వీడియో స్పష్టంగా ఇంటర్నెట్ లో జోరుగా వైర‌ల్ అవుతోంది. సంగీత స్వరకర్త అనిరుధ్ రవిచందర్ గానంలో విరుపు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు విడుదల కానున్న ఈ పాట లిరికల్ వీడియోతో పాటుగా లిరిసిస్ట్ పేరు సహా పాటకు సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

ఆడియో లాంచ్ క్యాన్సిల్: ముందుగా ప్ర‌క‌టించిన‌ట్టే సెప్టెంబర్ 30, ఆదివారం చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో జరగాల్సిన లియో ఆడియో విడుదల కార్యక్రమం రద్దు అయింది. ఓవర్‌ఫ్లోయింగ్ పాస్ రిక్వెస్ట్‌లు సేఫ్టీ పరిమితుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. అయితే ఇది విజయ్ అభిమానులను తమిళ సినీ ప్రేమికులను కలవరపెట్టింది.

లియోలో ద‌ళ‌పతి విజయ్ టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు సమాచారం. లియో దాస్ గా అత‌డు క‌నిపిస్తాడు. త్రిష కృష్ణన్ కథానాయిక. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విల‌న్ గా న‌టిస్తున్నారు. లియోలో గౌతమ్ వాసుదేవ్ మీనన్, అర్జున్ సర్జా, అనురాగ్ కశ్యప్, మిస్కిన్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ త‌దిత‌రులు సహాయక పాత్రల్లో నటించారు.