లోకేష్ కనగరాజ్ లియో కథని తెలివిగా అక్కడి నుంచి లేపేశాడా?
అయితే హాలీవుడ్ యాక్షన్ డ్రామా 'ఏ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్' సినిమాని తమిళ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెలివిగా కాపీ కొట్టినట్టుగా తెలుస్తోంది.
By: Tupaki Desk | 9 Oct 2023 10:05 AM GMTతెలుగు, తమిళ, హిందీ భాషల్లో బ్లాక్ బస్టర్లుగా నిలిచి స్టార్ హీరోల కెరీర్‌లని మలుపు తిప్పిన సినిమాలు చాలా వరకు హాలీవుడ్ మూవీస్ నుంచి స్ఫూర్తి పొందినవే. 'ఖైదీ' నుంచి నిన్న మొన్నటి యాక్షన్ మూవీస్ 'సాహో', అజ్ఞాతవాసి' వరకు హాలీవుడ్ సినిమాలని తీసుకుని చేసినవే. తెలుగులో విడుదలైన గ్యాంగ్ స్టర్ సినిమాలు చాలా వరకు హాలీవుడ్ మూవీస్ నుంచి తెలివిగా కాపీ చేసినవే వున్నాయి. అందులో 'గాయం 2' సినిమా కూడా ఒకటి. దీన్ని హాలీవుడ్ యాక్షన్ డ్రామా 'ఏ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్' ఆధారంగానే చేశారు.
దీన్ని ట్రెండ్ సెట్టర్ మూవీ 'గాయం'కు సీక్వెల్‌గా చేసిన విషయం తెలిసిందే. అయితే హాలీవుడ్ యాక్షన్ డ్రామా 'ఏ హిస్టరీ ఆఫ్ వయొలెన్స్' సినిమాని తమిళ క్రేజీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెలివిగా కాపీ కొట్టినట్టుగా తెలుస్తోంది. 'విక్రమ్' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకున్న లోకేష్ కనగరాజ్ దీనికి లింకప్ చేస్తూ తనదైన సినిమాటిక్ యూనివర్స్ నేపథ్యంలో భాగంగానే 'లియో'ని రూపొందించారు. కార్తి 'ఖైదీ'కి లింకప్ చేస్తూ 'విక్రమ్'ని రూపొందించిన లోకేష్ కనగరాజ్ దీనిలో భాగంగానే దళపతి విజయ్ హీరోగా 'లియో'ని తెరకెక్కించారు.
రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌లోని సన్నివేశాలు, హీరో క్యారెక్టరైజేషన్, విలన్ బ్యాచ్‌ని తప్పించుకోవడం కోసం హీరో దూరంగా ఉంటూ ఓ రెస్టారెంట్‌ని రన్ చేస్తుండటం, సాధారణ వ్యక్తిగా భార్య, పాపతో కలిసి జీవిస్తుండటం..విషయం తెలుసుకున్న గ్యాంగ్ అతన్ని వెతుక్కుంటూ రావడం..అతని ఫ్యామిలీని టార్గెట్ చేయడం.. అది భరించలేని సదరు వ్యక్తి తిరిగి గ్యాంగ్ స్టర్‌గా మారి వారిపై యుద్ధం చేయడం ప్రధానంగా చూపించారు. సో మన దళపతి విజయ్ 'లియో' పక్కా హాలీవుడ్ సినిమాకు కాపీ అన్నమాట.
కల్ట్ సినిమాల దర్శకుడిగా పేరున్న లోకేష్ కనగరాజ్ తెలివిగా హాలీవుడ్ మూవీని కాపీ చేసి 'లియో'ని తెరకెక్కించాడని స్పష్టమవుతోంది. చాలా రోజులుగా ఈ విషయం వైరల్ అవుతున్నా టీమ్ నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. ఇదిలా ఉంటే 'లియో' ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా సంచలనం సృష్టిస్తోంది. అభిమానులు మాత్రం ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. విజయ్ చరిష్మా కారణంగా ఈ సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.