రిలీజ్ కి ముందే లియో టేబుల్ ప్రాఫిట్
ఇళయదళపతి విజయ్ గత కొన్నేళ్ళుగా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. ప్రతి సినిమా 200 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంటున్నాయి.
By: Tupaki Desk | 9 Oct 2023 3:51 AM GMTఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కి రిలీజ్ కి రెడీ అవుతోన్న మూవీ లియో. అక్టోబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం రిలీజ్ కి సిద్ధం అవుతోంది. తాజాగా వచ్చిన ట్రైలర్ రికార్డు స్థాయిలో వ్యూస్ సొంతం చేసుకోవడం ద్వారా సినిమాకి ఏ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయో చెప్పకనే చెబుతోంది.
ఇళయదళపతి విజయ్ గత కొన్నేళ్ళుగా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు. ప్రతి సినిమా 200 కోట్లకి పైగా కలెక్షన్స్ అందుకుంటున్నాయి. వీటిలో కొన్ని 300 కోట్లు కూడా క్రాస్ అయ్యాయి. బడ్జెట్ పరంగా కూడా 150 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. బడ్జెట్ ఎంత పెట్టిన అంతకు రెట్టింపుగా దళపతి విజయ్ సినిమలపై బిజినెస్ జరుగుతూ ఉండటం విశేషం.
ఈ ఏడాదిలో విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన వారిసు మూవీ ఎవరేజ్ టాక్ తెచ్చుకున్న కూడా 300 కోట్ల కలెక్షన్స్ క్రాస్ చేసింది. దీనినిబట్టి అతని సత్తా ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు లోకేష్, విజయ్ కాంబోలో రిలీజ్ కి సిద్ధమవుతోన్న లియో సినిమాపై ఏకంగా 500 కోట్ల వరకు బిజినెస్ జరగడం విశేషం. ఈ చిత్రాన్ని సుమారు 300 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.
ఇందులో మేజర్ షేర్ నాన్ థీయాట్రికల్ రైట్స్ ద్వారానే వచ్చేశాయి. 240 కోట్లకి పైగా డిజిటల్ అండ్ శాటిలైట్, ఆడియో రైట్స్ ద్వారా నిర్మాతకి వచ్చాయి. ఇక థీయాట్రికల్ బిజినెస్ లెక్కలు చూసుకుంటే ప్రపంచ వ్యాప్తంగా 260 కోట్ల వరకు జరిగినట్లు తెలుస్తోంది. తమిళనాడులోనే వంద కోట్లకి ఈ మూవీ రిలీజ్ రైట్స్ ని కొనుగోలు చేశారు.
తెలుగులో కూడా ఏకంగా 21 కోట్లకి పైగా పెట్టి సితారా ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ లెక్కల ప్రకారం నిర్మాత పెట్టిన పెట్టుబడి కంటే 200 కోట్లు అధికంగా లియో సినిమాపై రిలీజ్ కి ముందే వచ్చేసింది. ఫుల్ టేబుల్ ప్రాఫిట్ తో థియేటర్స్ లోకి వస్తోన్న ఈ సినిమా ఏ మాత్రం హిట్ టాక్ సొంతం చేసుకున్న కోలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసే అవకాశం ఉంది.