లియో టైటిల్ కిరికిరి.. నాగవంశీ ఏమన్నారంటే..
స్పెషల్ షో లకు సంబంధించిన ఒక విషయంలో చిత్ర యూనిట్ అక్కడ ప్రభుత్వంతో గట్టిగానే పోరాడుతోంది.
By: Tupaki Desk | 17 Oct 2023 11:19 AM GMTవిజయ్ లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో రూపొందిన లియో సినిమా ఈ నెల 19వ తేదీన గ్రాండ్గా విడుదల కాబోతోంది. గత కొన్ని రోజులుగా సినిమాకు సంబంధించిన అనేక రకాల విషయాలు అయితే సోషల్ మీడియాలో గట్టిగానే హడావిడి చేశాయి. ఇక రిలీజ్ టైం దగ్గర పడుతున్న సమయంలో పలు కోర్టు సమస్యలు కూడా చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఇప్పటికే తమిళనాడులో చిత్ర నిర్మాతలు అక్కడ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్పెషల్ షో లకు సంబంధించిన ఒక విషయంలో చిత్ర యూనిట్ అక్కడ ప్రభుత్వంతో గట్టిగానే పోరాడుతోంది. న్యాయస్థానాన్ని కూడా సంప్రదించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మరొక విషయం సినిమా రిలీజ్ కు అడ్డుపడే అవకాశం ఉన్నట్లుగా టాక్ వైరల్ అవుతుంది.
ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 19వ తేదీన రాకపోవచ్చు అని 20వ తేదీన రావచ్చు అని సోషల్ మీడియాలో కొత్త న్యూస్ వైరల్ అయింది. అందుకు కారణం ఈ సినిమా టైటిల్ కాపీ రైట్స్ మరొకరి దగ్గర ఉండడమే. లియో తెలుగు టైటిల్ తాము ఎప్పుడో రిజిస్టర్ చేసుకున్నమని కొందరు హైదరాబాద్ సివిల్ కోర్టును ఆశ్రయించగా సినిమా రిలీజ్ ను న్యాయస్థానం స్టే విధించినట్లుగా కథనాలు వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ విషయంపై నిర్మాత నాగ వంశీ వెంటనే రియాక్ట్ అయ్యారు. ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. సీతారా ఎంటర్టైన్మెంట్స్ లో రెండు రాష్ట్రాల్లో లియో సినిమాను అనుకున్న డేట్ ప్రకారం అక్టోబర్ 19వ తేదీన విడుదలవుతుంది అనే గట్టిగా సమాధానం ఇచ్చారు. ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదని కూడా అన్నారు. అయితే లియో టైటిల్ విషయంలో అభ్యంతరం చెప్పినవారు డైరెక్టుగా మమ్మల్ని సంప్రదించలేదు అని వాళ్ళు డైరెక్ట్ గా కోర్టుకు వెళ్లారు అని అన్నారు.
అయితే వీలైనంత త్వరగా ఆ విషయాన్ని చర్చించుకుని పరిష్కరించుకుంటామని కూడా నాగ వంశీ తెలియజేశారు. కానీ సినిమా విడుదల విషయంలో అయితే ఆలస్యం జరగదు అని, ఎందుకంటే సినిమా టైటిల్ ఎప్పుడో అనౌన్స్ చేశారు అంతేకాకుండా సెన్సార్ బోర్డు నుంచి అఫీషియల్ గా విడుదల చేసుకోవడానికి పర్మిషన్ కూడా దొరికింది. అయితే వచ్చిన ఆరోపణలపై పూర్తిస్థాయిలో చర్చలు జరిపి ఎవరికి ఇబ్బంది కలగకుండా పరిష్కరించుకుంటామో అని నాగవంశీ తెలియజేశారు.