Begin typing your search above and press return to search.

పాఠ్యాంశంలో త‌మ‌న్నా.. త‌ల్లిదండ్రులు అభ్యంత‌రం!

మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా పేరు ఊహించ‌ని ఓ వివాదంలో తెర‌పైకి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   27 Jun 2024 3:30 PM GMT
పాఠ్యాంశంలో త‌మ‌న్నా.. త‌ల్లిదండ్రులు అభ్యంత‌రం!
X

మిల్కీ వైట్ బ్యూటీ త‌మ‌న్నా పేరు ఊహించ‌ని ఓ వివాదంలో తెర‌పైకి వ‌చ్చింది. అది స్కూల్ పిల్ల‌ల త‌ల్లిదండ్రుల్లో వ్య‌తిరేక‌త‌కు కార‌ణ‌మైంది. ప్ర‌ముఖ ద‌క్షిణాది న‌టి తమన్నా భాటియాపై పాఠ్యపుస్తకాలలోని అధ్యాయంపై హెబ్బాల్‌(బెంగ‌ళూరు)లోని సింధీ హైస్కూల్‌లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వారు సమస్యను పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించ‌క‌పోవ‌డంతో కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ .. అలాగే కర్ణాటకలోని ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలల అనుబంధ నిర్వహణ సంస్థ‌ల్ని ఆశ్రయించాల్సి వచ్చింది.

త‌మ‌న్నాపై పాఠ్యాంశం ఉన్న ఇదే అధ్యాయంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ వంటి సింధీ కమ్యూనిటీకి చెందిన ప్రముఖులు.. కెరీర్ విజయవంతంగా సాగిస్తున్న ఇత‌ర సెల‌బ్రిటీల‌పై ప్ర‌స్థావ‌న ఉంది. అయితే తమన్నాకు సంబంధించిన కంటెంట్‌తో మాత్రమే త‌మ‌కు సమస్య ఉందని తల్లిదండ్రులు చెప్పారు. పాఠశాలలో సింధీస్‌పై 7వ తరగతి పాఠ్యపుస్తకం ఉంది. అందులో ఒక అధ్యాయం ``విభజన తర్వాత జీవితం: సింధ్‌``లో 1947 నుండి 1962 వరకు వలసలు, సంఘం, ఇత‌ర కలహాలు వంటివి ఉన్నాయి. సింధీలు భాషాపరమైన మైనారిటీ అయినందున విద్యార్థులకు వారి సంఘం తాలూకా సంస్కృతిని పరిచయం చేసే ప్ర‌య‌త్న‌మిది.

మరో సంస్కృతి గురించి పిల్లలకు పరిచయం చేయడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు! అని కమీషన్ అలాగే అసోసియేషన్ ముందు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు చెప్పారు. కానీ గ్రేడ్ 7 విద్యార్థులకు సరిపోని న‌టిపై ఒక అధ్యాయాన్ని కలిగి ఉండటమే మా అభ్యంతరం.. అని ఫిర్యాదు చేసారు. ఇలా ఈ పాఠ్యాంశంపై అభ్యంతరాలు చెబితే తమ వార్డులకు బదిలీ సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యం బెదిరిస్తోందని కొందరు తల్లిదండ్రులు ఆరోపించారు. అనుచితమైన కంటెంట్... సింధీ కమ్యూనిటీలోని ప్రముఖ నటీన‌టులపై పాఠాలు ఉన్నా కానీ మాకు ఎటువంటి సమస్యలు లేవు.. కానీ పిల్లలు ఈ నటి గురించి ఇంటర్నెట్‌లో వెతికితే వారు అనుచితమైన కంటెంట్‌ను చూస్తారు! అని మరొక పేరెంట్ వాదించారు.

అసోసియేషన్ జనరల్ సెక్రటరీ డి శశికుమార్ ఇలా అన్నారు. ఏదేమైనా ఏదైనా కంటెంట్‌ను జోడించడానికి లేదా తొల‌గించ‌డానికి సంబంధిత బోర్డు ఆమోదం పొందాలి. దానికి పాఠశాల అనుబంధంగా ఉంది. తల్లిదండ్రులు తప్పనిసరిగా (కాబట్టి) బోర్డు ముందు దానిని తీసుకురావాలి. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి పాఠశాల అధికారులు అందుబాటులో లేరని ప్ర‌ముఖ జాతీయ మీడియా త‌న క‌థ‌నంలో పేర్కొంది.