Begin typing your search above and press return to search.

సాయి ధరమ్ తేజ్.. ఈ టైటిల్ ఏదో కొత్తగా ఉందే..

అయితే మూవీ బడ్జెట్ తో పాటు ఇతర కారణాల వలన క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   27 Jun 2024 8:24 AM GMT
సాయి ధరమ్ తేజ్.. ఈ టైటిల్ ఏదో కొత్తగా ఉందే..
X

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ విరూపాక్ష సినిమాతో చివరిగా సాలీడబ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో సినిమాలో నటించారు. ఈ సినిమా ఏవరేజ్ టాక్ తెచ్చుకుంది. తరువాత సంపత్ నంది దర్శకత్వంలో గంజా శంకర్ అనే సినిమాని ఎనౌన్స్ చేశారు. అయితే మూవీ బడ్జెట్ తో పాటు ఇతర కారణాల వలన క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది. టైటిల్ పైన కూడా అభ్యంతరాలు వచ్చాయి.

దీంతో కొంత గ్యాప్ తీసుకొని హనుమాన్ మూవీ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి నిర్మాణంలో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రోహిత్ కేపీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం మూవీకి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని తెలుస్తోంది. ఐశ్వర్య లక్ష్మి ఈ సినిమాలో తేజ్ కి జోడీగా కనిపించబోతోందంట. భారీ బడ్జెట్ తోనే మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది.

పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతోందంట. ఈ సినిమాకి ఇంటరెస్టింగ్ టైటిల్ ని చిత్ర యూనిట్ కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తోంది. 'సంబరాల ఏటిగట్టు' అనే టైటిల్ ని ఖరారు చేసారంట. ఈ టైటిల్ ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉందనే మాట వినిపిస్తోంది. అలాగే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కథ ఉండబోతోందని టైటిల్ బట్టి అర్ధమవుతోంది. త్వరలో ఈ సినిమాకి సంబందించిన పూర్తి వివరాలు బయటకొచ్చే అవకాశం ఉందంట.

ఈ మధ్యకాలంలో అందరూ పీరియాడిక్ డ్రామాలు ఎక్కువగా టచ్ చేస్తున్నారు. అలాగే తేజ్ కూడా విరూపాక్ష సినిమాలో ఇంచుమించు పీరియాడికల్ ఫిక్షన్ జోనర్ లోనే చేసి సక్సెస్ అందుకున్నాడు. సంబరాల ఏటిగట్టు కూడా అదే తరహాలో ఉంటుందంట. అలాగే యాక్షన్ పార్ట్ కి ఈ సినిమాలో ప్రాధాన్యత ఉంటుందనే మాట వినిపిస్తోంది. సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ కోసం పెద్ద సెట్ కూడా వేశారంట.

త్వరలో మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాబోతోందని తెలుస్తోంది. కెరియర్ లో విరూపాక్షతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన తేజ్ కి ఈ సంబరాల ఏటిగట్టు అంతకు మించిన హిట్ ఇస్తుందా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాలి. దీంతో పాటు మరికొన్ని ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయనే ప్రచారం కూడా టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది. మరి సాయి ధరమ్ తేజ్ కెరీర్ ఎలా సాగుతుందో చూడాలి.