సినిమా చూడకుండానే రివ్యూలు ఇది న్యాయమేనా?
అలాగే మరో దర్శక, నిర్మాత లిజో జోస్ పెల్లిస్సేరి కూడా స్పందించారు. `ఈ సినిమాపై ప్రేక్షకులకు ఎలాంటి ఆసక్తి లేకుండా కలుగ చేసారు.
By: Tupaki Desk | 16 Jan 2025 1:30 PM GMTఇటీవలే మోహన్ లాల్ స్వీయా దర్శకత్వంలో నటించిన `బరోజ్` భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రచార చిత్రాలతో ఈ సినిమా విజువల్ ఫీస్ట్ లా హైలైట్ అవుతుందని అంతా భావించారు. సినిమాలో పాత్రలు...వాటి గెటప్ లు ప్రతీది మంచి బజ్ ని తీసుకొచ్చింది. కానీ రిలీజ్ అనంతరం తొలి షోతోనే సంగ తేంటని తేలిపోయింది. సినిమాకి నెగిటివ్ రివ్యూలు రావడంతో ఒక్కసారిగా అంచనాలు తల్లకిందులయ్యాయి.
దీన్నో 'చిల్డ్రన్స్ వాచ్'గా భావించారు. ఆర్ ఆర్ అతిగా అనిపించదనే విమర్శలొచ్చాయి. అయితే ఈ సినిమా వైఫల్యంతో మోహన్ లాల్ ఎంతో బాధపడినట్లు ఓ నిర్మాత తెలిపారు. అలాగే మరో దర్శక, నిర్మాత లిజో జోస్ పెల్లిస్సేరి కూడా స్పందించారు. `ఈ సినిమాపై ప్రేక్షకులకు ఎలాంటి ఆసక్తి లేకుండా కలుగ చేసారు. చాలా మంది సినిమా చూడకుండానే రివ్యూలు ఇచ్చారు. సినిమా ఎలా ఉంది? అన్నది తర్వాత సంగతి.
ఆ లోతుకు నేను వెళ్లాలనుకోవడం లేదు. కానీ నేను ఒక విషయం గట్టిగా చెప్పగలను. మోహన్ లాల్ చాలా బాధపడ్డారు. ప్రేక్షకుల వరకూ ఈ సినిమాను తీసుకెళ్లడంలో మోహన్ లాల్ సక్సెస్ అయ్యారు. కానీ ప్రేక్షకులకు ఆశీర్వదించలేదు. అందుకు నేను వారిని నిందించను. మలైకోట్టై వాలిబన్ కూడా భారీ అంచనాలతో రిలీజ్ అయి ఫెయిలైన చిత్రం. అధికా హైప్ కారణంగా ఆ సినిమాకి కొంత నష్టం జరిగింది. అంచనాలు ఆ సినిమా అందుకో లేకపోయింది.
కానీ బరోజ్ థియేటర్లో రిలీజ్ అయిన దగ్గర నుంచి భిన్నమైన కథనాలు చూసాను. థియేటర్లో సినిమాను ఫోన్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో లీక్ చేసారు. కెమెరాలతో షూట్ చేసారు. మోహన్ లాల్ ఈ కారణంగా ఎంతో బాధపడ్డారు. చాలా మంది సినిమా చూడకుండానే రివ్యూలు ఇచ్చేసారు. ఇలా చేయడం మరింత బాధకు గురి చేస్తుంది. ఇలా చేయడం భావ్యమేనా? అలా రివ్యూలు ఇచ్చిన వారందరికీ న్యాయంగానే అనిపించిందా? అన్నది గుండె మీద చేయి వేసుకుని చెప్పాలన్నారు. ప్రస్తుతం మోహన్ లాల్ `ఎల్ 2: ఎంపురాన్` ,` తుడారమ్` చిత్రాల్లో బిజీగా ఉన్నారు.