Begin typing your search above and press return to search.

దేవర కోసం ఆ స్టార్ డైరెక్టర్ భార్య.. విజిల్ వైబ్!

ఇప్పటికే 'దేవర' సినిమాని చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ తో తమ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   27 Sep 2024 4:56 AM GMT
దేవర కోసం ఆ స్టార్ డైరెక్టర్ భార్య.. విజిల్ వైబ్!
X

ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురుచూసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘దేవర’ మూవీ థియేటర్స్ లోకి వచ్చింది. అర్ధరాత్రి 1 గంటకి బెన్ ఫిట్ షోలతో ‘దేవర’ సందడి తెలుగు రాష్ట్రాలలో షురూ అయ్యింది. మరోవైపు అమెరికాలో కూడా ప్రీమియర్ షో లతో ‘దేవర’ వైబ్ మొదలైంది. సెలబ్రెటీలతో పాటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘దేవర’ చిత్రాన్ని మొదటి రోజే చూడటానికి సిద్ధమైపోయారు. ఇప్పటికే ‘దేవర’ సినిమాని చూసిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్వీట్స్ తో తమ ఒపీనియన్స్ షేర్ చేసుకుంటున్నారు.


ఫ్యాన్స్ నుంచి అయితే సినిమాకి ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమాలో ఎన్టీఆర్ రెండు క్యారెక్టర్స్ లలో అద్భుతంగా నటించాడని అంటున్నారు. కొన్ని సీక్వెన్స్ గూస్ బాంబ్స్ తెప్పించేలా ఉన్నాయని ట్వీట్ లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వైఫ్ లిఖిత ‘దేవర’ సినిమా గురించి ఇన్ స్టాగ్రామ్ లో ఇంటరెస్టింగ్ పోస్ట్ పెట్టారు. ‘దేవర’ పోస్టర్ ని ముందు షేర్ చేశారు. దీని తర్వాత చేతిలో విజిల్ ని చూపిస్తూ ఆల్ సెట్ అని కామెంట్ మెన్షన్ చేశారు.

ఎర్లీ మార్నింగ్ షో చూడటానికి ప్రశాంత్ నీల్, అతని భార్య లిఖిత థియేటర్స్ కి వెళ్లినట్లు ఈ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ బట్టి అర్ధమవుతోంది. విజిల్ కూడా తీసుకెళ్లారంటే కచ్చితంగా ఈ చిత్రాన్ని ఆమె ఫుల్ గా ఆస్వాదించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మధ్య మంచి బాండింగ్ ఉంది. లిఖిత కూడా ఎన్టీఆర్ కి ఫ్యాన్ అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ‘దేవర’ మూవీ మొదటి ఆటనే చూసేందుకు ఆమె థియేటర్స్ కి వెళ్లినట్లున్నారు.

‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక మూవీ చేయబోతున్నారు. ఈ ఏడాదిలోనే ఆ మూవీ షూటింగ్ కూడా మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ కాంబినేషన్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఇక ఆరేళ్ళ గ్యాప్ తర్వాత ఎన్టీఆర్ నుంచి సోలోగా వచ్చిన మూవీ కావడంతో ‘దేవర’ పై నెక్స్ట్ లెవల్ హైప్ ఉంది. కొరటాల శివ ఈ చిత్రం కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. అది సినిమాలో ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుందని ట్విట్టర్ లో ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. కచ్చితంగా ఎన్టీఆర్ కెరియర్ లో బెస్ట్ సినిమాల జాబితాలో ‘దేవర’ నిలుస్తుందని భావిస్తున్నారు. మరి ఈ సినిమా పూర్తి స్థాయిలో అన్ని వర్గాల ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుందో లేదో తెలియాలి అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.