Begin typing your search above and press return to search.

ఈగల్ కు, కమల్ సినిమాతో లింక్?

2023 స్టార్టింగ్ లో చిరంజీవి వాల్తేరు వీరయ్యలో గెస్ట్ రోల్ లో అలరించిన రవితేజ.. ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర మూవీలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు

By:  Tupaki Desk   |   30 Dec 2023 5:01 PM GMT
ఈగల్ కు, కమల్ సినిమాతో లింక్?
X

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ.. వరుస సినిమాలతో సందడి చేస్తున్నారు. బాక్సాఫీస్ వద్ద మూవీ రిజల్ట్ తో సంబంధం లేకుండా దూసుకెళ్తున్నారు. 2023 స్టార్టింగ్ లో చిరంజీవి వాల్తేరు వీరయ్యలో గెస్ట్ రోల్ లో అలరించిన రవితేజ.. ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు, రావణాసుర మూవీలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అవి నిరాశపరిచాయి. ప్రస్తుతం ఆయన ఈగల్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన విడుదల కానుంది. వెంకటేశ్ సైంధవ్ కూడా అదే రిలీజ్ కానుంది. బాక్సాఫీస్ వద్ద గట్టిపోటీ ఉన్నా రిలీజ్ విషయంలో తగ్గేదేలా అన్నట్లు.. ప్రమోషన్లలో స్పీడ్ పెంచుతున్నారు మేకర్స్. అయితే సంక్రాంతికి మహేశ్ గుంటూరు కారం, నాగార్జున నా సామిరంగా వంటి కమర్షియల్ సినిమాలు రిలీజ్ అవుతుండడంతో రవితేజ ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు. మాస్ యాక్షన్ మూవీ ఈగల్ రిజల్డ్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ అనుమానాలకు ఈగల్ డైరెక్టర్ కమ్ ఎడిటర్ కార్తీక్ ఘట్టమనేని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన విరుమాండి (పోతురాజు) సినిమాతో ఈగల్ ను లింక్ చేస్తున్నారు. 2004లో కమల్ డైరెక్షన్ లో తమిళంలో తెరకెక్కిందీ సినిమా. తెలుగులో పోతురాజుగా డబ్ అయింది. అయితే ఈ మూవీ రేష్ మ్యాన్ ఎఫెక్ట్ (టిపికల్ స్క్రీన్ ప్లే)తో తెరెకెక్కింది.

అంటే ఒకే ఇన్సిడెంట్ ను మూడు పాత్రల్లో వేర్వేరు యాంగిల్స్ లో చూపిస్తారు మేకర్స్. అలా మూడు సన్నివేశాలను చూసిన ప్రేక్షకులకు ఏది నిజమో ఏది అబ్బద్ధమో అర్థం చేసుకునేందుకు పరీక్ష పెట్టడమే ఈ ఎఫెక్ట్ ప్లాన్. సూర్య తో మణిరత్నం తెరకెక్కించిన యువ సినిమాలో కూడా ఈ రకమైన నెరేషన్ నే ఉపయోగించారు. ఇప్పుడు ఈగల్ లో కూడా కార్తీక్ ఇదే విధంగా స్టోరీని నెరేట్ చేశారట. మాస్ ను మిస్ చేయకుండా సక్సెస్ ఫుల్ గా సినిమా తెరకెక్కించారట.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకునేలా చేశాయి. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజతోపాటు అనుపమ పరమేశ్వరన్, కావ్య తాపర్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. నవదీప్, అవసరాల శ్రీనివాస్, వినయ్ రాయ్, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబోట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.