Begin typing your search above and press return to search.

పాటపై ప్రేమతో లక్షల జీతం వదిలేసింది..!

ఈ అమ్మడు జాబ్ ను వదిలేసి సంగీతాన్ని కెరీర్ ను ఎంపిక చేసుకుంది. అంతే కాకుండా ఆమెకు జీవితం మొత్తం పాటే జీవితం అన్నట్లుగా సాగుతుందట.

By:  Tupaki Desk   |   10 Nov 2023 3:30 PM GMT
పాటపై ప్రేమతో లక్షల జీతం వదిలేసింది..!
X

లీసా మిశ్రా.. ఈ పేరు సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా ఉండే వారికి సుపరిచితం. ఈమె పాటలు యూట్యూబ్‌ ను ఫాలో అయ్యే వారికి పరిచయమే. ఈ అమ్మడు ఒడిశా కి చెందిన కుటుంబం లో జన్మించినప్పటికి యూఎస్ లో డెటా ఎనలిస్ట్‌ గా మంచి ఉద్యోగంను చేసింది. లక్షల జీతం వద్దు అనుకుని ముంబైకి వచ్చేసింది.

అమెరికాలో అద్భుతమైన జీవితాన్ని వదిలేసి ముంబైకి ఈమె రావడానికి కారణం ఆమెకు పాట పై ఉన్న ప్రేమ. ఆ ప్రేమ కారణంగానే లీసా మిశ్రా అక్కడి నుంచి ఇక్కడకు వచ్చింది. సింగర్ గా, కంపోజర్ గా రైటర్ గా మల్టీ ట్యాలెంట్‌ అనిపించుకోవడంతో పాటు సినిమాల్లో రాణించాలనే ఉద్దేశ్యంతో తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

ఇన్ స్టా గ్రామ్‌ మరియు యూట్యూబ్‌ లో ఫుల్‌ పాపులారిటీని సొంతం చేసుకున్న ఈ అమ్మడు జాబ్ ను వదిలేసి సంగీతాన్ని కెరీర్ ను ఎంపిక చేసుకుంది. అంతే కాకుండా ఆమెకు జీవితం మొత్తం పాటే జీవితం అన్నట్లుగా సాగుతుందట. తనకు మ్యూజీషియన్ గా, సింగర్ గా పేరు తెచ్చుకోవడంలో యూట్యూబ్‌ క్రియాశీలకంగా వ్యవహరించిందని ఆమె పేర్కొంది.

వీరే ది వెడ్డింగ్‌ సినిమాతో బాలీవుడ్‌ లో సింగర్ గా ఎంట్రీ ఇచ్చిన లీసా మిశ్రా తనకంటూ ఉన్న ప్రత్యేకమైన వాయిస్ కారణంగా మంచి గుర్తింపును దక్కించుకుంది. ముందు ముందు హిందీ తో పాటు సౌత్ ఇండియన్ సినిమాల్లో కూడా పాటలు పాడటం మాత్రమే కాకుండా షో లు చేయాలని ఆశ పడుతోందట. లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసినా కూడా కోట్లాది మంది అభిమానులను ఈమె సొంతం చేసుకుందని ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు.