ఎల్ సీ యూ తర్వాతే ఆయన రిటైర్మెంట్!
అలాగే ఓ ఆరేళ్ల పాటు తన ఎల్ సీ యూ నుంచి వచ్చే సినిమాలన్నీ కూడా క్రైమ్ నేపథ్యంతోనే ఉంటాయని...కానీ అవన్నీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయని అన్నాడు.
By: Tupaki Desk | 19 March 2025 2:01 PM ISTకోలీవుడ్ సంచలనం లోకేష్ కనగరాజ్ దర్శకుడిగా పది సినిమాలు పూర్తి చేసిన తర్వాత ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోతానని ప్రకటించిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా కేవలం పది సినిమాలు చేసి పోవాలన్నదే తన ఉద్దేశం. ఎక్కువ కాలం సినిమా ఇండస్ట్రీలో ఉండటం తనకు ఇష్టం లేదని...తాను కోరుకున్న మరో రంగం ఒకటుందని అన్నాడు. అలాగే ఓ ఆరేళ్ల పాటు తన ఎల్ సీ యూ నుంచి వచ్చే సినిమాలన్నీ కూడా క్రైమ్ నేపథ్యంతోనే ఉంటాయని...కానీ అవన్నీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయని అన్నాడు.
అంటే లోకేష్ ఎల్ సీ యూనుంచి పూర్తి చేయాల్సిన సినిమాలు పూర్తయితే రిటైర్మెంట్ దాదాపు కన్పమ్ అయినట్లే. ఎందుకంటే ఆయన ఇప్పటికే `కూలీ`తో కలిపి ఆరు సినిమాలు పూర్తి చేసేసాడు. `మానగరం`తో లోకేష్ డైరెక్టర్ అయ్యాడు. అందువల్ల సందీప్ కిషన్ హీరోగా నటించాడు. అదొక సస్పెన్స్ థ్రిల్లర్. ఆ తర్వాత `ఖైదీ`తో ఫేమస్ అయ్యాడు. అటుపై విజయ్ `మాస్టర్` తో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.
అనంతరం ఎల్ సీ యూలో భాగంగా కమల్ హాసన్ తో `విక్రమ్`తీసి పాన్ ఇండియాలో ఫేమస్ అయ్యాడు. తలపతి విజయ్ తో ఎల్ సీయూ భాగంలోనే `లియో` చేసి విజయం అందుకున్నాడు. ఇలా తీసిన ఐదు సినిమాల్లో నాలుగు సినిమాలు భారీ విజయాలు సాధించాయి. రజనీకాంత్ తో తెరకెక్కించిన `కూలీ` త్వరలో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది.
తర్వలోనే `ఖైదీ -2` ని లోకేష్ పట్టాలెక్కిస్తాడు. అంటే ఇది ఏడవ సినిమా అవుతుంది. అటుపై సూర్య హీరోగా `రోలెక్స్` సినిమా చేస్తాడు. ఇది నెంబర్ 8. అనంతరం విజయ్ అంగీకరిస్తే `లియో` కి సీక్వెల్ గా` పార్తీబన్` టైటిల్ తో ఓ సినిమా తీస్తాననన్నాడు. ఇది నెంబర్ 9. ఇక మిగిలింది ఒక్క సినిమా మాత్రమే. అది ఎల్ సీ యూ నుంచే వస్తుంది. ఇవన్నీ ఐదారేళ్లలో పూర్తి చేసే అవకాశం ఉంది.