Begin typing your search above and press return to search.

కింగ్ మీద లోకేష్ స్పెషల్ ఫోకస్..!

అంతేకాదు రజినీ కూలీలో కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. ముఖ్యంగా కింగ్ నాగార్జునని స్పెషల్ గా చూపించబోతున్నారని తెలుస్తుంది.

By:  Tupaki Desk   |   16 March 2025 3:00 AM IST
కింగ్ మీద లోకేష్ స్పెషల్ ఫోకస్..!
X

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలీ సినిమా చేస్తున్నాడు. కార్తికి ఖైది, కమల్ హాసన్ కు విక్రం, విజయ్ కు లియో సినిమాలు ఇచ్చిన లోకేష్ సూపర్ స్టార్ కోసం కూలీ సినిమాతో బెస్ట్ హిట్ ఇచ్చేందుకు కృషి చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతి హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. అంతేకాదు రజినీ కూలీలో కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర కూడా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తున్నారు. ముఖ్యంగా కింగ్ నాగార్జునని స్పెషల్ గా చూపించబోతున్నారని తెలుస్తుంది.

లోకేష్ సినిమాలో నాగార్జున అనగానే అందరు సర్ ప్రైజ్ అయ్యారు. ఐతే సినిమాలో నాగార్జునది నెగిటివ్ రోల్ అని టాక్ వినిపిస్తుంది. అయినా కూడా లోకేష్ కనకరాజ్ ఈ రోల్ ని చాలా స్టైలిష్ గా తీర్చిదిద్దారని తెలుస్తుంది. నాగార్జున స్టైలిష్ యాక్షన్ గురించి తెలుసు కాబట్టే లోకేష్ ఈ సినిమాలో ఆయన నాగ్ మీద స్పెషల్ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. సినిమాలో నాగార్జున లుక్స్, యాక్షన్ అన్నీ కొత్తగా ఉంటాయని అంటున్నారు.

అక్కినేని ఫ్యాన్స్ కి కూలీ సినిమాలో నాగార్జున పాత్ర చాలా నచ్చేస్తుందని అంటున్నారు. చెప్పుకోవడానికి రజినీ సినిమా అన్న ఒక చిన్న ఇబ్బందే కానీ కూలీ సినిమాలో నాగార్జున ఒప్పుకున్నందుకు వర్తబుల్ అనిపించేలా ఆయన పాత్ర ఉంటుందని అంటున్నారు. నాగార్జున రజినీకాంత్ ఉపేంద్ర ఇలా భారీ స్టార్ కాస్ట్ తో లోకేష్ తన మాస్ మసాలా ట్రీట్ మెంట్ తో కూలీ సినిమా చేస్తున్నాడు.

ఇప్పటికే సూపర్ స్టార్ ఫ్యాన్స్ కూలీ మీద భారీ అంచనాలు ఏర్పరచుకోగా అది చాలదు అన్నట్టుగా అక్కినేని ఫ్యాన్స్ కూడా ఈ సినిమా మీద భారీ హోప్స్ తో ఉన్నారని తెలుస్తుంది. నాగార్జున మాత్రం ఈ సినిమాతో నిజంగానే సర్ ప్రైజ్ చేస్తారని అంటున్నారు. కూలీ సినిమా రిలీజ్ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. అసలైతే మే 1న రిలీజ్ అని అన్నారు కానీ సూర్య రెట్రో ఆ డేట్ కి వస్తున్నాడు కాబట్టి కూలీ రిలీజ్ డేట్ మారే ఛాన్స్ ఉంటుంది. జైలర్ తో సూపర్ హిట్ అందుకున్న రజినీ కూలీతో దాన్ని మించి సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు. సూపర్ స్టార్ మాస్ స్టామినా ఏంటో చూపించే సినిమాగా కూలీ రాబోతుందని తెలుస్తుంది. మరి ఈ సినిమా ఏం చేస్తుందన్నది చూడాలి.