Begin typing your search above and press return to search.

అక్కినేని కాలేజీ.. లోకేష్ కనగరాజ్ క్లాసెస్..

కంప్లీట్ యాక్షన్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఆ సినిమాతో ఓ రేంజ్ లో ప్రశంసలు అందుకున్నారు లోకేష్.

By:  Tupaki Desk   |   2 April 2025 11:05 AM
అక్కినేని కాలేజీ.. లోకేష్ కనగరాజ్ క్లాసెస్..
X

కోలీవుడ్ స్టార్ లోకేష్ కనగరాజ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. అవియల్ షార్ట్ ఫిల్మ్ తో మంచి క్రేజ్ సంపాదించుకున్న ఆయన.. మా నగరం మూవీతో డైరెక్ట్ గా మారారు. థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఆ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత ఖైదీ మూవీతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

కంప్లీట్ యాక్షన్ అండ్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఆ సినిమాతో ఓ రేంజ్ లో ప్రశంసలు అందుకున్నారు లోకేష్. ఆ తర్వాత కమల్ హాసన్ తో విక్రమ్ మూవీ తీయగా.. ఫుల్ ఫేమస్ అయిపోయారు. అనంతరం దళపతి విజయ్ తో మాస్టర్ తీసిన లోకేష్.. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తో వర్క్ చేస్తున్నారు.

వారి కాంబోలో కూలీ మూవీ తెరకెక్కుతుండగా.. ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఆ మూవీ రిలీజ్ కానుంది. ఆ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నాగార్జున ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ & మీడియాలో సందడి చేయనున్నారు లోకేష్.

ప్రజంట్ జనరేషన్ కు తగ్గట్లు సినిమాలు తీసే టాలెంట్ ఉన్న ఆయన.. అన్నపూర్ణ కాలేజీకి చీఫ్ గెస్ట్ గా వెళ్లనున్నారు. ఏప్రిల్ 4న చిత్రనిర్మాణంపై క్లాస్ తీసుకోబోతున్నారు. తన సినిమా కూలీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీగా ఉన్నా.. యంగ్ యాక్టింగ్ జనరేషన్ కు మెలకువలు నేర్పించడానికి ఆయన అటెండ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

దీంతో లోకేష్ టాలెంట్ కోసం అంతా మాట్లాడుకుంటున్నారు. లోకేష్ తన యాక్షన్ ఎంటర్టైనర్‌ లతో సౌత్ ఇండియా కమర్షియల్ మూవీని పునర్నిర్వచించారని కొనియాడుతున్నారు. కొత్త తరం.. ఆయన అభిప్రాయాలను వింటే ఉత్సాహంగా ఉంటుందని చెబుతున్నారు. మొత్తానికి అక్కినేని కాలేజీ విద్యార్థులకు మంచి అవకాశం దొరికిందని అంటున్నారు.

భారతీయ సినిమా కోసం యువతలో ప్రతిభను ప్రోత్సహించడానికి అన్నపూర్ణ స్టూడియోస్.. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాను అభివృద్ధి చేసింది. చలనచిత్ర నిర్మాణానికి సంబంధించిన అత్యుత్తమ సంస్థలలో ఒకటిగా పేరుగాంచింది. నాగార్జున, అక్కినేని కుటుంబం కొత్త సాంకేతికతలతో పాటు హై ప్రొఫైల్ గెస్ట్ క్లాసెస్ విద్యార్థుల పాఠ్యాంశాల్లోకి చేర్చుతున్నారు. అందులో భాగంగా ఇప్పుడు లోకేష్ ను ఆహ్వానించారు.