లోకేష్ కనగరాజ్.. నెక్స్ట్ ఆ కోలీవుడ్ యంగ్ హీరోతో!
ఇప్పటికే అదిరిపోయే లైనప్ ను సెట్ చేసుకున్న లోకేష్ కనగరాజ్.. త్వరలో యంగ్ హీరో శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేయనున్నారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
By: Tupaki Desk | 19 Oct 2024 6:34 AM GMTఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు తీసినవి తక్కువ సినిమాలే అయినా.. తనదైన మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు. ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. లోకేష్ డెన్ నుంచి మూవీ వస్తుందంటే చాలు.. సూపర్ హిట్ అవుతుందని అంతా ఫిక్స్ అయిపోతున్నారు. అంతలా సినీ ప్రియుల నమ్మకాన్ని గెలుచుకున్నారు.
లోకేష్ కనగరాజ్ ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన ఖైదీ, మాస్టర్, విక్రమ్ మూవీస్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. వాటితో ఒక సిగ్నేచర్ మార్క్ ను సొంతం చేసుకున్నారు. అదే సమయంలో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ పై ప్రేక్షకుల్లో హోప్స్ పెంచారు. అందులో నుంచి ఫ్యూచర్ లో మరిన్ని సినిమాలు రానున్నట్లు తెలిపారు. విక్రమ్ 2, రోలెక్స్, ఖైదీ 2, లియో 2 ప్రాజెక్టులతో త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పుడు రజినీకాంత్ తో కూలీ మూవీ చేస్తున్నారు.
ప్రస్తుతం కూలీ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. గోల్డ్ అక్రమ రవాణా నేపథ్యంతో తెరకెక్కుతున్న ఆ మూవీ కోసం అన్ని ఇండస్ట్రీల నుంచి క్యాస్టింగ్ ను తీసుకొచ్చారు లోకేష్. టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటిస్తున్నారు. మహేంద్రన్, మంజుమ్మెల్ బాయ్స్ ఫేం సౌబిన్ షాహిర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే సోషల్ మీడియాలో ఇప్పుడు లోకేష్ కనగరాజ్ లైనప్ కోసం జోరుగా చర్చ సాగుతోంది.
ఇప్పటికే అదిరిపోయే లైనప్ ను సెట్ చేసుకున్న లోకేష్ కనగరాజ్.. త్వరలో యంగ్ హీరో శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేయనున్నారని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఆ మూవీ కోసం లోకేష్ స్క్రిప్ట్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం.. శివ కార్తికేయన్ కు లోకేష్ స్టోరీ నెరేట్ చేశారని సమాచారం. వెంటనే యంగ్ హీరో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని వినికిడి. దీంతో మరికొద్ది రోజుల్లో లోకేష్, శివ కార్తికేయన్ కాంబోలో సినిమా స్టార్ట్ అవ్వనుందని టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి లోకేష్ కనగరాజ్.. వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. తన లైనప్ లో అదిరిపోయే చిత్రాలను చేర్చుకుంటున్నారు. డైరెక్టర్ గా మరింత క్రేజ్ సంపాదించుకునేందుకు ఓ ప్లాన్ తో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే తన అప్ కమింగ్ మూవీస్ పై మంచి అంచనాలు క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు శివ కార్తికేయన్ తో సినిమా చేయనున్నట్లు వార్తలు రావడంతో.. వెయిటింగ్ ఫర్ క్రేజీ మూవీ అంటూ సినీ ప్రియులు కామెంట్లు పెడుతున్నారు. మరి అది నిజమో కాదో చూడాలి.