లోకేష్ కనగరాజ్.. ఆ ప్రొడక్షన్ లో మూడు సినిమాల భారీ డీల్!
లేటెస్ట్ డైరెక్టర్లలో మోస్ట్ వాంటెడ్ ఫిల్మ్ మేకర్ ఎవరు అంటే చాలా మంది టాలీవుడ్, కోలీవుడ్ ఫ్యాన్స్ చెప్పే లిస్టులో లోకేష్ కనగరాజ్ పేరు తప్పకుండా ఉంటుంది.
By: Tupaki Desk | 21 March 2025 12:27 PM ISTలేటెస్ట్ డైరెక్టర్లలో మోస్ట్ వాంటెడ్ ఫిల్మ్ మేకర్ ఎవరు అంటే చాలా మంది టాలీవుడ్, కోలీవుడ్ ఫ్యాన్స్ చెప్పే లిస్టులో లోకేష్ కనగరాజ్ పేరు తప్పకుండా ఉంటుంది. ఖైదీ, విక్రమ్, లియో వంటి హిట్లతో ఇండియన్ సినిమా లోకేష్ టేకింగ్ చూసి ఆశ్చర్యపోయింది. ఇక ఇప్పుడు ఆయన మరో పెద్ద అడుగు వేసినట్లు టాక్. కన్నడలో బిగ్ బడ్జెట్ సినిమాలు నిర్మించే ప్రొడక్షన్స్ తో మూడు సినిమాల భారీ డీల్ ను లాక్ చేసినట్లు ఇండస్ట్రీ టాక్ బలంగా వినిపిస్తోంది.
ఈ మూడు సినిమాలు తక్కువ టైమ్ లో కాకుండా, వరుసగా ప్లాన్ చేయనున్నారని సమాచారం. ప్రాజెక్ట్ లు తక్కువ గ్యాప్ తో సెట్స్ పైకి తీసుకెళ్లేలా కంట్రాక్ట్ ఉండొచ్చని కోలీవుడ్ వర్గాల బజ్. ఈమధ్య హోంబలే ఫిల్మ్స్-ప్రభాస్ కాంబినేషన్ లో కూడా ఇలాగే మూడు సినిమాల డీల్ జరిగింది. అదే తరహాలో ఇప్పుడు KVN ప్రొడక్షన్ - లోకేష్ డీల్ ఫైనలైజ్ అయ్యిందని చెబుతున్నారు.
అయితే లోకేష్ ఇటీవలే తాను ఎక్కువగా ఎల్‌సీయూ లైన్లోనే సినిమాలు చేస్తానని ఓ ఇంటర్వ్యూలో చెప్పడం మరింత ఆసక్తి కలిగిస్తోంది. ఇక ఈ మూడు సినిమాల్లో ఒకటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఉంటుందనే ప్రచారం సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఇప్పటికే సుకుమార్ తో ‘RC17’, బుచ్చిబాబు సానాతో ‘RC16’ ప్రాజెక్టుల్ని లైన్ లో పెట్టిన చరణ్… RC18 కోసం లోకేష్ కనగరాజ్ తో కలిసి పాన్ ఇండియా లెవెల్ లో మల్టీ జానర్ యాక్షన్ థ్రిల్లర్ ప్రిపేర్ చేస్తున్నారని టాక్.
అయితే ఇది ఎల్‌సీయూ లో భాగంగా ఉంటుందా లేక కొత్త కాన్సెప్ట్‌తో వచ్చే ప్రాజెక్ట్ అవుతుందా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ఈ కాంబోపై నార్త్ నుంచి సౌత్ వరకు ఫ్యాన్స్ క్రేజ్ నెలకొల్పడం మాత్రం గ్యారెంటీ. మిగిలిన రెండు ప్రాజెక్ట్స్ లో ఒకటి కార్తీ ‘ఖైదీ 2’ కావొచ్చని మరోది సూర్య ‘రోలెక్స్’ ఫుల్ ఫ్లెజ్డ్ స్టోరీ కావొచ్చని చెబుతున్నారు. ఇప్పటికే విక్రమ్ లో సూర్య పాత్ర ప్రేక్షకులని కట్టిపడేసిన సంగతి తెలిసిందే.
ఈ మూడింటిని కేవీఎన్ నిర్మిస్తే… లోకేష్ కెరీర్‌లోనే కాదు, కోలీవుడ్ టాలీవుడ్ ఇండస్ట్రీల్లోనూ కొత్త రికార్డు అవుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. మొత్తానికి లోకేష్ కేవీఎన్ డీల్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ప్రాజెక్టులపై త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చని టాక్. మెగా ఫ్యాన్స్ అయితే రామ్ చరణ్ - లోకేష్ కనగరాజ్ కాంబోపై హైప్ మొదలెట్టేశారు. మరి ఈ డీల్ ఎలాంటి సెన్సేషనల్ ప్రాజెక్ట్స్ ను అందిస్తుందో చూడాలి.