స్టార్ హీరోతో లోకేష్ కనగరాజ్ భారీ గ్రాఫికల్ మూవీ!
ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 'కూలీ' సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 18 Jan 2025 2:30 PM GMTకోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ మరో ఆరేడు సంవత్సరాలు పాటు డైరెక్టర్ గా పుల్ బిజీ. ఎల్సీయూ నుంచి కొన్ని సినిమాలు పూర్తి చేయాల్సి ఉంది. 'విక్రమ్-2' ,' ఖైదీ-2', 'లియో-2', 'రోలెక్స్' చిత్రాలు ఇప్పటికే ప్రకటించాడు. వాటిని పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం అతడి ముందున్న కర్తవ్యం. ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా 'కూలీ' సినిమా తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఇది ఎల్ సీయూ తో సంబంధం లేని చిత్రం.
ఇలా మధ్యలో అప్పుడప్పుడు యూనివర్శ్ తో సంబంధం లేని సినిమాలు కూడా రిలీజ్ చేస్తుంటాడు. ఆ లిస్ట్ హీరోల్లో బాలీవుడ్ మిస్టర్ పర్పెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అమీర్ ఖాన్ తో కనగరాజ్ ఓ సూపర్ హీరో చిత్రం ప్లానింగ్ కూడా ఉంది. 'ఇరంబుకై మాయావీ' అనే టైటిల్ తో ఓ స్టోరీ సిద్దం చేసి పెట్టాడు. వాస్తవానికి ఈ చిత్రాన్ని తమిళ్ లోనే ఓ స్టార్ హీరోతో తీయాలనుకున్నాడు.
కానీ తర్వాత కాలం లో ఆ ఆలోచన విరమించుకుని ఆ స్టోరీని అమీర్ ఖాన్ వైపు మళ్లిస్తున్నట్లు వెలుగులోకి వస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో అప్ డేట్ కూడా వైరల్ అవుతోంది. ఈ చిత్రాన్ని తమిళ్ కంటే హిందీలో తెరకెక్కిం చాలని లోకేష్ సన్నాహాలు చేస్తున్నాడుట. కొంత మంది కోలీవుడ్ నటుల్ని కలుపుకుని అమీర్ ఖాన్ హీరోగా ఈ సినిమాని పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నాడుట. ఈ చిత్రాన్ని నిర్మించడానికి కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ముందుకొస్తుందిట.
అమీర్ తో పాటు సైమల్టేనియస్ గా కమల్ తో కూడా కనగరాజ్ చర్చలు జరుపుతున్నాడుట. 'కూలీ' రిలీజ్ అనంతరం ముగ్గురు మరోసారి భేటీ అయి ప్రాజెక్ట్ ని ఫైనల్ చేయనున్నారని కోలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే స్టోరీని కూడా బాలీవుడ్ కి కనెక్ట్ చేస్తూ కొన్నిమార్పులు కూడా చేసే అవకాశం ఉందంటున్నారు.