Begin typing your search above and press return to search.

ఐదేళ్ల‌పాటు ఆయ‌న ఇలా ఫిక్సైపోయాడు!

`ఖైదీ`తో పాన్ ఇండియాలో పాపుల‌ర్ అయిన లోకేష్ క‌న‌గ‌రాజ్ ఎల్ సీ యూలో సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   13 Oct 2024 5:30 PM GMT
ఐదేళ్ల‌పాటు ఆయ‌న ఇలా ఫిక్సైపోయాడు!
X

`ఖైదీ`తో పాన్ ఇండియాలో పాపుల‌ర్ అయిన లోకేష్ క‌న‌గ‌రాజ్ ఎల్ సీ యూలో సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. త‌న‌కంటూ ఎల్ సీయూ అనే యూనివ‌ర్శ్ ని క్రియేట్ చేసుకుని సినిమాలు చేస్తున్నాడు. ఇవ‌న్నీ యాక్ష‌న్ నేప‌థ్యంతో కూడిన‌వే. డ్ర‌గ్స్, గ‌న్ప్, హ‌వాలా అనే బేస్ పాయింట్ ల‌తోనే అల్లుకుని ముందుకెళ్తున్నారు. క్యారెక్ట‌ర్ లు ఇంకా బ‌లంగా పండితే? వాటిని స‌ప‌రేట్ ఆ క్యారెక్ట‌ర్ తోనే మ‌రో సినిమా చేసేలా ముందుకెళ్తున్నారు.

ఇప్ప‌టికే రోలెక్స్ పాత్ర‌తో ప్ర‌త్యేకంగా ఓ సినిమా కూడా ప్ర‌క‌టించాడు. ప్ర‌స్తుతం సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత తో `కూలీ` అనే సినిమా చేస్తున్నాడు. ఇది కూడా లోకేష్ యూనివ‌ర్శ్ నుంచి వ‌స్తోన్న చిత్ర‌మేనే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఇది ఎల్ సీయూ నుంచి మిన‌హాయించిన చిత్రంగా క‌న‌క‌రాజ్ క్లారిటీ ఇచ్చాడు. ఇందులో ర‌జ‌నీకాంత్ గోల్డ్ స్మ‌గ్ల‌ర్ పాత్ర పోషిస్తున్నారు. ఆయ‌న పాత్ర‌ని బేస్ చేసుకుని ఇది కూడా ఎల్ సీయూ నుంచి వ‌స్తోన్న చిత్రంగానే అభిమానులు భావిస్తున్నారు.

కానీ తాజా ట్విస్ట్ తో అంతా షాక్ అవ్వాల్సిన ప‌రిస్థితి. అలాగే లోకేష్ ఏ సినిమా చేసినా ఆరు నెల‌ల‌లోపు షూటింగ్ పూర్తి చేస్తాన‌ని...ఇంత‌వ‌ర‌కూ చేసిని సినిమాలన్నీ అలాగే పూర్త‌య్యాయన్నాడు. కూలీ కూడా అలాగే పూర్త‌వుతుం ద‌`న్నాడు. అక్టోబ‌ర్ 16 నుంచి ర‌జ‌నీకాంత్ తిరిగి షూటింగ్ లో జాయిన్ అవుతార‌ని తెలిపాడు. అలాగే భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక రివీల్ చేసాడు. వ‌చ్చే ఐదేళ్ల పాటు గ‌న్స్, బ్ల‌డ్ లేకుండా త‌న సినిమాలేవి ఉండ‌వ‌న్నాడు.

ఖైదీ, విక్ర‌మ్, లియో తో యూనివ‌ర్శ్ మొద‌లైంది. దాన్ని పూర్తి చేయాలంటే ఈ ఐదేళ్లు ప‌డుతుంది. కూలీ పూర్త‌యిన త‌ర్వాత ఎల్ సీయూ హీరోలంద‌రితో పీక్ ఎల్ సీయూ యూవీ ఒక‌టుంద‌న్నాడు. ఇది అభిమానుల‌కు మ‌రో గుడ్ న్యూస్. అంటే కూలీ త‌ర్వాత ఈ సినిమా మొద‌ల‌వుతుంద‌ని, క‌థ కూడా సిద్దం చేసి పెట్టిన‌ట్లు గెస్ చేస్తున్నారు.