Begin typing your search above and press return to search.

క‌న‌గ‌రాజ్ భారీ VFX ఫాంట‌సీ థ్రిల్ల‌ర్.. హీరో ఎవ‌రో తెలుసా?

అదే స‌మ‌యంలో లోకేష్ క‌న‌గ‌రాజ్ మ‌రో స్క్రిప్టుపై కూడా ప‌ని చేస్తున్నారు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ న‌టించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

By:  Tupaki Desk   |   16 Jan 2025 4:40 AM GMT
క‌న‌గ‌రాజ్ భారీ VFX ఫాంట‌సీ థ్రిల్ల‌ర్.. హీరో ఎవ‌రో తెలుసా?
X

ఖైదీ, విక్ర‌మ్, లియో లాంటి బ్లాక్ బ‌స్టర్ చిత్రాల‌తో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన లోకేష్ క‌న‌గ‌రాజ్ ప్ర‌స్తుతం ర‌జ‌నీకాంత్ క‌థానాయ‌కుడిగా కూలి చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత అత‌డు వ‌రుస‌గా సీక్వెల్ చిత్రాల‌కు ప‌ని చేస్తాడని స‌మాచారం. కార్తీతో ఖైదీ 2, క‌మ‌ల్ హాస‌న్ తో విక్ర‌మ్ 2, సూర్య‌తో రోలెక్స్ స్క్రిప్టుల‌పై ఇప్ప‌టికే ప‌ని జ‌రుగుతోంది.

అదే స‌మ‌యంలో లోకేష్ క‌న‌గ‌రాజ్ మ‌రో స్క్రిప్టుపై కూడా ప‌ని చేస్తున్నారు. ఈ చిత్రంలో అమీర్ ఖాన్ న‌టించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఇది ఫాంట‌సీ క‌థాంశం. భారీ వీఎఫ్ఎక్స్ తో రూపొందుతుంది. క‌థ న‌చ్చ‌డంతో అమీర్ ఖాన్ త‌న సొంత నిర్మాణ సంస్థ‌లో తెర‌కెక్కించేందుకు ఆస‌క్తిని క‌న‌బ‌రిచార‌ని స‌మాచారం. నిజానికి ఇదే క‌థ‌తో సూర్య క‌థానాయ‌కుడిగా లోకేష్ డెబ్యూ మూవీ తెర‌కెక్కాల్సి ఉన్నా.. అది కుద‌ర‌లేదు. బ‌డ్జెట్ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో చిత్రీక‌ర‌ణ‌కు వెళ్ల‌లేదు. కానీ ఇప్పుడు అమీర్ ఖాన్ స‌హ‌కారంతో ఇది ప‌ట్టాలెక్కేందుకు అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.

జైల‌ర్ 2 టీజ‌ర్ పై ప్ర‌శంస‌లు:

కూలీ ద‌ర్శ‌కుడు లోకేష్ క‌న‌గ‌రాజ్ ఇటీవ‌ల రిలీజైన `జైల‌ర్ 2` టీజ‌ర్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. ర‌జ‌నీ-నెల్స‌న్ దిలీప్ కుమార్ కాంబినేష‌న్ మూవీకి `బ్లాస్ట్-ఓ-బ్లాస్ట్` అంటూ ఉత్సాహం నింపారు. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ లోని తన ఐకానిక్ పాత్ర `టైగర్` ముత్తువేల్ పాండియన్‌తో మళ్ళీ పెద్ద తెరపై అల‌రించ‌నున్నాడు. జైలర్ 2 ప్ర‌క‌ట‌న‌ టీజర్ ఇటీవల ఇంటర్నెట్ లో సంచలనం సృష్టించింది. 4 నిమిషాల నిడివి గల `జైల‌ర్ 2` ప్రోమోలో అనిరుధ్, నెల్సన్ తమ పని గురించి ఎప్పటిలాగే సరదాగా మాట్లాడుతూ క‌నిపించారు.