Begin typing your search above and press return to search.

వెయ్యి కోట్లపై ఆ దర్శకుడి కన్ను!

కానీ ఇంతవరకు కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం రూ.1000 కోట్ల క్లబ్ లో చేరలేకపోయింది. తాజాగా ఆ బాధ్యతను నేను తీసుకుంటా అంటున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.

By:  Tupaki Desk   |   27 Nov 2023 7:08 AM GMT
వెయ్యి కోట్లపై ఆ దర్శకుడి కన్ను!
X

ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్ల క్లబ్ ని ఓపెన్ చేసింది మన తెలుగు సినిమానే. ఎస్. ఎస్ రాజమౌళి ఈ ఘనత సాధించారు. ఆ వెంటనే బాలీవుడ్ కూడా ఈ క్లబ్ లో జాయిన్ అయింది. ఎలాంటి అంచనాలు లేకపోయినా కన్నడ సినిమా కూడా ఈ ఘనత సాధించింది. కానీ ఇంతవరకు కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం రూ.1000 కోట్ల క్లబ్ లో చేరలేకపోయింది. తాజాగా ఆ బాధ్యతను నేను తీసుకుంటా అంటున్నాడు సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్.

బాహుబలి సినిమాతో వెయ్యి కోట్ల మార్కెట్ ఓపెన్ అయింది. ఆ తర్వాత బాలీవుడ్ నుంచి దంగల్, పఠాన్, జవాన్.. కన్నడ ఇండస్ట్రీ నుంచి కేజిఎఫ్ 2 ఈ మార్కెట్లో చోటు సంపాదించుకున్నాయి. కానీ పాన్ ఇండియా ట్రెండ్ రాకముందే సౌత్ కి కొన్ని నేషనల్ సినిమాలు ఇచ్చిన తమిళ సినిమా మాత్రం ఇంతవరకు వేయికోట్ల మార్కును అందుకోలేకపోయింది. అందుకే రాబోయే రోజుల్లో ఆ కోరిక తీరుతుందేమో అని ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు తమిళ ఆడియన్స్.

శంకర్, మణిరత్నం లాంటి స్టార్ డైరెక్టర్స్ తమ సినిమాలకు వందల కోట్లు సాధించినా, వెయ్యి కోట్ల మార్కెట్ ను టచ్ చేయలేకపోయారు. ఇప్పుడు ఆ టార్గెట్ ను రీచ్ అయ్యేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్. ఇప్పటికే లియో సినిమాతో రూ.500 కోట్ల మార్క్ క్రాస్ చేసిన లోకేష్ తన నెక్స్ట్ టార్గెట్ రూ.1000కోట్లు అంటున్నాడు. లియో సక్సెస్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తో సినిమా చేస్తున్నాడు లోకేష్.

LCU లో భాగంగా తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. లియోతో మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ ని టచ్ చేసిన లోకేష్ ప్రమోషన్స్ మాత్రం రీజనల్ మార్కెట్ లోనే చేశాడు. కానీ రజిని సినిమా విషయంలో అలా కాకుండా స్పెషల్ ప్లాన్ రెడీ చేస్తున్నాడు. అటు జైలర్ తో భారీ కం బ్యాక్ అందుకున్న రజిని కూడా లోకేష్ మూవీ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు.

సూపర్ స్టార్ మ్యానియా కి లోకేష్ టేకింగ్ తోడైతే కలెక్షన్ విషయంలో డౌటే ఉండదని మేకర్స్ భావిస్తున్నారు. అందుకే ఈసారి రూ.1000 కోట్లు టార్గెట్ తో బరిలోకి దిగబోతున్నారు. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? రజిని మూవీతో లోకేష్ నిజంగానే వెయ్యికోట్ల మార్క్ అందుకొని తమిళ సినిమా కల నెరవేరుస్తాడేమో చూడాలి.