ఎల్‌సీయూ లో అరడజను సినిమాలు
సౌత్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి విభిన్నమైన ఇమేజ్ దక్కింది. ఆయన ఖైదీ సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడిగా మంచి పేరును దక్కించుకున్నాడు.
By: Tupaki Desk | 1 Nov 2023 4:51 AM GMTసౌత్ సినీ ఇండస్ట్రీలో దర్శకుడు లోకేష్ కనగరాజ్ కి విభిన్నమైన ఇమేజ్ దక్కింది. ఆయన ఖైదీ సినిమా తో పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడిగా మంచి పేరును దక్కించుకున్నాడు. విభిన్న యాక్షన్ సినిమాల దర్శకుడిగా లోకేష్ కనగరాజ్ కి మంచి క్రేజ్ దక్కింది. ఎల్‌సీయూ అంటూ దర్శకుడి నుంచి వరుస సినిమాలు రాబోతున్నాయి.
తాజాగా తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరో గా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా వచ్చింది. తెలుగు లో లియో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు కానీ తమిళంలో మాత్రం వందల కోట్ల వసూళ్లు సాధించింది. ఖైదీ మరియు విక్రమ్ సినిమాల రేంజ్ లో లియో లేదు అనేది ఓవరాల్ టాక్. అయినా కూడా లోకేష్ కనగరాజ్ రేంజ్ ఏమాత్రం తగ్గలేదు.
ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకంత్ తో సినిమాను చేసేందుకు గాను లోకేష్ రెడీ అవుతున్నాడు. వచ్చే ఏడాదిలోనే ఖైదీ 2 ను మొదలు పెట్టబోతున్నట్లుగా ఇటీవల లియో సినిమా ప్రెస్ మీట్ లో లోకేష్ కనగరాజ్ ప్రకటించాడు. ఖైదీ 2 సినిమా చాలా విభిన్నమైన పాత్రలు ఉంటాయని లోకేష్ ఇప్పటికే హింట్ ఇచ్చాడు.
లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోని పాత్రలు అన్నింటిని కూడా ఖైదీ 2 లో మరింత డెప్త్ గా చూపించబోతున్నట్లుగా కూడా దర్శకుడు పేర్కొన్నాడు. హీరో లు, విలన్ లను ఖైదీ 2 లో చూపించే తీరుకు కచ్చితంగా ప్రేక్షకులు సర్ ప్రైజ్ అవ్వబోతున్నారు అంటూ తమిల్ మీడియా వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతోంది.
ఇక ఎల్‌సీయూ నుంచి మరిన్ని సినిమాలు వస్తాయట. ముఖ్యంగా ప్రస్తుతం రజినీకాంత్ తో తీయబోతున్న సినిమా తర్వాత ఖైదీ 2, విక్రమ్ 2, రోలెక్స్ పాత్ర తో ఒక ఫుల్ నిడివి సినిమాను మరియు లియో 2 ను కూడా చేస్తానంటూ లోకేష్ కనగరాజ్ ప్రకటించాడు. ఇవన్నీ కూడా కనెక్షన్ తో ఉంటాయని, అందువల్ల ప్రేక్షకులు కచ్చితంగా సర్ ప్రైజ్ ఫీల్ అవుతారు అంటూ ఆయన ధీమాగా ఉన్నాడు. రాబోయే మూడు నాలుగు ఏళ్లలో ఎల్‌సీయూ నుంచి ఎలాంటి సినిమాలు, పాత్రలు వస్తాయో చూడాలి.
ఖైదీ 2 సినిమా లో ఢిల్లీ యొక్క గతం మరియు వర్తమానం కథను చూపించబోతున్నారట. ఈ కథ ను ఇప్పటికే కార్తికి చెప్పడం, ఓకే చెప్పించడం జరిగిందట. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని కూడా ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఖైదీ 2 లో సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్ చాలానే ఉండబోతున్నాయని మళ్లీ మళ్లీ చెబుతున్న లోకేష్ ఏం చేస్తాడో చూడాలంటే మరి కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.